Adbhutam Song Lyrics – Lover

Adbhutam Lyrics Song – Lover

Adbhutam Song :
Song Credits :
Music : Tanishk Bagchi 
Lyrics : Sri Mani
Female Singer : Ranjini Jose 
Male Singer : Jubin Nautiyal
కళ్ళలో దాగి ఉన్న కలలు ఓ అద్భుతం
నా కాలాలనే నిజం చేసే నువ్వు ఓ అద్భుతం
పరి పరి తలిచేలా నీ పరిచయం అద్భుతం
పడి పడి చదివేలా నీ మనసు నా పుస్తకం
పదహారు ప్రాయంలోన పరువాల ప్రణయం లోన
హృదయాలను కలిపేసి పండగే అద్భుతం
ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే
ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతం
ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే
ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతం
కిరణం తోరణంలా సిరులే కురియువేళ
తలపే వామనంలా వలపే గెలుచువేళ
ప్రియుడిని చూసి ప్రేయసి పూసే
బుగ్గన సిగ్గే ఎంతో అద్భుతం
ఆరారు రుతువులు అన్ని తమ ఇల్లే ఎక్కడ అంటే
మన అడుగులనే చూపే సంబరం అద్భుతం
ఏవేవో సంగీతాలు ఎన్నెన్నో సంతోషాలు
మన గురుతులుగా మిగిలే ఈ వేడుకే అద్భుతం
ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే
ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతం
ఇలా మనకంటూ ఒకరుంటే ప్రతి పయనం రంగులమయమే
ఇలా నా వెంట నువ్వుంటే జీవితమే ఓ అద్భుతం

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*