Anaganaga Aakasam Undi Song Lyrics – Nuvve Kavali

Anaganaga Aakasam Undi Song Lyrics :

Song Credits:
చిత్రం : నువ్వే కావాలి (2000)
సంగీతం : కోటి
సాహిత్యం : సిరివెన్నెల సీతారామ శాస్త్రి
గానం : చిత్ర , జయచంద్రన్
అనగనగా ఆకాశం ఉంది – ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది – రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది – చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల – చిలకలు వాలే చెట్టయ్యింది
నా చిలక నువ్వే కావాలి – నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి – అనురాగాల మువ్వై మోగాలి

ఊగే కొమ్మల్లోనా చిరుగాలి కవ్వాలి
పాడి కచ్చేరి చేసే వేళల్లో
గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు
ఆడి తాళాలే వేసే వేళల్లో
కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా
ఆఆఆఆఆఅ….
ఆఆఆఆఆఆఆఅ….
ఆ నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి
నువ్ చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి
నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి
అనగనగా ఆకాశం ఉంది – ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది – రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది – చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల – చిలకలు వాలే చెట్టయ్యింది
నా చిలక నువ్వే కావాలి – నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి – అనురాగాల మువ్వై మోగాలి
చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ
ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో
నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం
వేచి సావాసం పంచే సమయంలో
నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా
ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి
అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే
నా చిలక నువ్వే కావాలి – నా రాచిలక నవ్వే కావాలి
అనగనగా ఆకాశం ఉంది – ఆకాశంలో మేఘం ఉంది
మేఘం వెనుక రాగం ఉంది – రాగం నింగిని కరిగించింది
కరిగే నింగి చినుకయ్యింది – చినుకే చిటపట పాటయ్యింది
చిటపట పాటే తాకిన నేల – చిలకలు వాలే చెట్టయ్యింది
నా చిలక నువ్వే కావాలి – నా రాచిలక నవ్వే కావాలి
రాగాల గువ్వై రావాలి – అనురాగాల మువ్వై మోగాలి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.

*