కొడుకా నా ముద్దు కొడుకా సాంగ్ లిరిక్స్ తెలుగు – మధు ప్రియా (2022)

కొడుకా నా ముద్దు కొడుకా సాంగ్ లిరిక్స్ తెలుగు here is the latest folk song koduka naa muddhu koduka sung by singer madhu priya lyrics written by bikshapathi

Song Credits:
Song: Kodukaa Naa Mudhu Koduka
Lyrics: Devarakonda Bikshapathi
Singer: Madhu Priya
Music: Kalyan keys
Label Credits: Lalitha Audios and Videos

కొడుకా నా ముద్దు కొడుకా సాంగ్ లిరిక్స్ తెలుగు

కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా

ఎక్కడ బోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా

కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా

ఎక్కడబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా

కడుపారాగన్న నీ కన్నతల్లినిరా
కనులారా సూద్దామనీ నేను కలెలెన్నోగన్నరా

నల్లనీ కాకమ్మతో సల్లంగా కబురంపా
కనుపడ్డోళ్లనీ అడిగినా కానరావయే కొడుకా

కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా

ఎక్కడాబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా

ఇంటి ముందు చింతచెట్టు మీద
కాకమ్మ కావు కావుమంటే

నా కొడుకే వస్తాడనుకొని
పాలుదెచ్చి పాశం మొండుకుంటి

ఏ దారి చూసినా ఎవ్వరూ రారాయే
ఆ పాశమన్నం పాశిపాయే
పాలబాకీ ఇంకా తీరదాయే

కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా

ఎక్కడబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా

యాడనన్న జాడదొరికితే
ఎములాడబోతనని మొక్కిన

వెయ్యి రూపాయలప్పు తెచ్చుకొని
యాటపోతు తెచ్చుకున్న

ఎన్నిరోజులని నేనూ
ఎదురుజూడను కొడుకా

ఆ యాటపోతు జెళ్లిపాయే
ఎములాడ జాతర ఎళ్లిపాయే

కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా

ఎక్కడాబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా

సాయనలుపు లుండేటోడు
నా సక్కని సిన్నికొడుకు

ఎక్కడా లేవంటే
నేను ఏమనుకోను కొడుకా

అన్నలా కొరకు కొడుకూ
అడవికి బోయిండేమో

వెన్నలాగన్న కొడుకుకు
వెన్ను దట్టి దారిచూపు

కొడుకా నా ముద్దు కొడుకో
కొడుకా ఓ సిన్ని కొడుకా

ఎక్కడాబోతివిరా
నేను ఒక్కదాన్నైతినిరా

అన్నల్లో గలిసిపోయే కొడుకా
అదృష్టమందరికి రాదూ

అన్యాయాన్ని ఎదురించినట్టి
అమరుల్ల బాటల్లో నడువు

అమరుడు పెద్దన్నబందుకు
అందుకోని ముందుకురుకు

నీకు బరువైతే సెప్పు కొడుకా
నా బలమిస్త వట్టు కొడుకా

నీకు బరువైతే సెప్పు కొడుకా
నా బలమిస్త వట్టు కొడుకా

నీకు బరువైతే సెప్పు కొడుకా
నా బలమిస్త వట్టు కొడుకా

Leave a Reply