Naalo Ninu chusukoga Song lyrics | Abhishekam

Naalo Ninu chusukoga Song lyrics | Abhishekam

Music   SV Krishna Reddy
Label   Mango Music

Naalo Ninu chusukoga Song lyrics:

నాలో నిను చూసుకోగా నాతో మురిపించుకోగా
ఒళ్ళో పాపాయివైనావమ్మా..!!
నిత్యం కాపాడుతున్నా నీలా నే పెంచగలనా
ఇంకా పసివాడినేగా అమ్మా..!!
రామరక్ష అని లాలపోసినా
శ్యామలాలి అని లాలిపాడినా
బువ్వపెట్టినా బుజ్జగించినా
చెయ్యిపట్టుకుని నడక నేర్పినా
అమ్మను మించిన అమ్మను నే కాగలనా ??

||నాలో నిను చూసుకోగా||

*నువ్వు మేలుకుని ఉంటే నాకు అది పట్టపగటి వేళ
ఆదమరిచి నువు నిద్దరోతే అది అర్థరాత్రి వేళ
నిన్ను మించి వేరే నా లోకమంటు లేదే
అలిగిన సమయాన్నే నడివేసవి అనుకోనా
కిలకిల నవ్వులనే చిరుజల్లులు అనుకోనా
చేసిన సేవలు నువు నేర్పినవే అమ్మా !!

||నాలో నిను చూసుకోగా||

*అమ్మ లాలన ఎంతపొందినా అంతనేది ఉందా
వేయిజన్మల ఆయువిచ్చినా చాలనిపిస్తుందా
అమ్మలేని బ్రహ్మ చేసేది మట్టిబొమ్మ
మనిషిగ మలిచేది కనిపెంచు తల్లి మహిమ
మనసున నిలిచేది ఆ మాతృమూర్తి ప్రతిమ
దేవుడు సైతం కోరిన దీవెన అమ్మా..!!

పాడే ఈ పాట పేరు
సాగే నా బాట పేరు
ఆగే ప్రతిచోటు పేరు అమ్మా..!!

ఎదలో నాదాల పేరు
కదిలే పాదాల పేరు
ఎదిగిన ఇన్నేళ్ళ పేరు అమ్మా..!!

అన్నమయ్య గీతాల భావన
త్యాగరాజు రాగాల సాధన
ఎన్ని పేర్ల దేవుల్ని కొలిచినా
తల్లివేరులా వాటి చాటున
ఉన్నది ఒక్కటే కమ్మని పేరు అమ్మా..!!

పాడే ఈ పాట పేరు
సాగే నా బాట పేరు
ఆగే ప్రతిచోటు పేరు అమ్మా..!

Leave a Reply

%d bloggers like this: