Nindu Noorella Savasam Song Lyrics, Nindu Noorella Savasam Lyrics Telugu Sai Sri Harsha, Nindu Noorella song sung by singer Sonu Nigam, Mahalakshmi Iyer music Kamalakar
Song : Nindu Noorella
Movie : Pranam
Music : Kamalakar
Lyrics : Sai Sri Harsha
Singers : Sonu Nigam, Mahalakshmi Iyer
Label Credits : Aditya Music
Nindu Noorella Savasam Song Lyrics – Pranam (2003)

Nindu Noorella Savasam Song Lyrics :
నేల తల్లి సాక్షిగా
నింగి తండ్రి సాక్షిగా
గాలిదేవర సాక్షిగా
అగ్ని దేవుని సాక్షిగా
గంగమ్మే సల్లంగా దీవించగా
నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం
వెండి వెన్నెల్లో కళ్యాణం
ఈ రీతులు గీతలు
సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో
సెలిమే చేద్దాము లే
నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం
సందమామ ఊరిలో
ఎన్నెలమ్మ వాడలో
అచ్చ తెలుగు
ముచ్చపూల పున్నమేనులే
రెల్లు కప్పు నేసిన
ఇంద్రధనసు గూటిలో
రేయి పగలు ఒక్కటేలె
రెప్ప పడదులే
ఈ మబ్బులే మన నేస్తులు
ఆ దిక్కులే మన ఆస్తులు
సల్లగాలుల పల్లకీలలో
సుక్క సుక్క నీ సుట్టి వద్దమా
నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం
ఈ రీతులు గీతలు
సెరిపెయ్యాలని ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో
సెలిమే చేద్దాము లే
వర్జ్యమంటు లేదులే
రాహుకాలమేదిలే
రాశి లేదు వాశి లేదు
తిథులు లేవులే
అథిధులంటు లేరు లే మనకు
మనమే సాలు లే మాసిపోని
బాసలన్ని బాసికాలు లే
ఏ ఏలుపు దిగి రాదులే మన
కూడికే మన తొడులే
ఇసుక దోసిలే తలంబ్రాలు
గా తలలు నింపగా మనువు జరిగెలే
నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం