Inkem Inkem Kaavale Lyrics – Geetha Govindam (2018)

Inkem Inkem Kaavale Lyrics, Inkem Inkem Kaavale song Lyrics, inkem inkem lyrics Telugu by Ananta Sriram, inkem song sung by singer Sid Sriram and music Gopi Sundar

Song Credits:
Song: Inkem Inkem Inkem Kaavaale
Movie: Geetha Govindam
Singer: Sid Sriram
Music: Gopi Sundar
Lyrics: Ananta Sriram

Inkem Inkem Kaavale Lyrics – Geetha Govindam (2018)

Inkem Inkem Kaavale Lyrics :

తదిగిన తకజను తదిగిన తకజను
తరికిట తదరిన తదీంత ఆనందం

తలవని తలపుగ ఎదలను కలుపగ
మొదలిక మొదలిక మళ్లీ ‘గీత గోవిందం

ఇంకేం ఇంకేం ఇంకేం
కావాలే చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరనాళ్లే

గుండెల్లోనా వేగం పెంచావే
గుమ్మంలోకి హోలీ తెచ్చావే

నువ్ పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కో గంట ఒక్కో జన్మై
మళ్లీ పుట్టి చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం
కావాలే చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి
వాలావే ఇకపై తిరనాళ్లే

తదిగిన తకజను తదిగిన తకజను
తరికిట తదరిన తదీంత ఆనందం

తలవని తలపుగ ఎదలను కలుపగ
మొదలిక మొదలిక మళ్లీ గీత గోవిందం

ఊహలకు దొరకని సొగసా
ఊపిరిని వదలని గొలుసా
నీకు ముడిపడినది తెలుసా
మనసుని ప్రతి కొసా

నీ కనుల మెరుపుల వరసా
రేపినది వయసున రభసా
నా చిలిపి కలలకు బహుశా

ఇది వెలుగుల దశా
నీ ఎదుట నిలబడు చనువే వీసా
అందుకుని గగనపు కొనలే చూశా

ఇంకేం ఇంకేం ఇంకేం
కావాలే చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే
ఇకపై తిరనాళ్లే

మాయలకు కదలని మగువా
మాటలకు కరగని మదువా

పంతములు విడువని బిగువా
జరిగినదడగవా

నా కథను తెలుపుట సులువా
జాలిపడి నిమిషము వినవా
ఎందుకని గడికొక గొడవా

చెలిమిగ మెలగవా
నా పేరు తలచితే ఉబికే లావా
చల్లబడి నను నువు కరుణించేవా

ఇంకేం ఇంకేం ఇంకేం
కావాలే చాలే ఇది చాలే

నీకై నువ్వే వచ్చి
వాలావే ఇకపై తిరనాళ్లే

గుండెల్లోనా వేగం పెంచావే
గుమ్మంలోకి హోలీ తెచ్చావే

నువ్ పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కో గంట ఒక్కో
జన్మై మళ్లీ పుట్టి చస్తున్నానే

ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే చాలే ఇది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్లే

తదిగిన తకజను తదిగిన తకజను
తరికిట తదరిన తదీంత ఆనందం

తలవని తలపుగ ఎదలను కలుపగ
మొదలిక మొదలిక మళ్లీ గీత గోవిందం

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: