Nammave Cheli Song Lyrics, Nammave Cheli Lyrics Telugu Varikuppala Yadagiri nammave cheli song sung by singer Sid Sriram and music Varikuppala Yadagiri
Song Credits:
Song :Nammave Cheli
Singer: Sid Sriram
Lyrics: Varikuppala Yadagiri
Movie : Nuvvante Neenani
Music : Varikuppala Yadagiri
Label Credit : Aditya Music
Nammave Cheli Song Lyrics – Nuvvante Neenani (2021)
Nammave Cheli Song Lyrics :

నమ్మవే చెలీ
నిన్ను నేను ప్రేమిస్తున్నానే
నా మనస్సులో నిన్ను
నిలిపి పూజిస్తున్నానే
కంటిలోన పాపలా ఉండిపోవే
గుండెలోన ఊపిరై నిండిపోవే
నమ్మవే చెలీ
నిన్ను నేను ప్రేమిస్తున్నానే
నా మనస్సులో నిన్ను
నిలిపి పూజిస్తున్నానే
నీవు లేని లోకమంతా
శూన్యమల్లె తోస్తుందీ
చావురాక ఉండలేక
బ్రతుకు నరకమౌతుందీ
తోడు ఉంటే ప్రపంచమంతా
వసంతమై పూస్తుంది
నీడలాంటి నిన్ను చూసి
మనసు మురిసి పోతుంది
పున్నమేల వెన్నెలున్నా
నీవు లేక చీకటేలే
కన్నులున్న కానరాక
గుండెలోన బాధ రగిలే
రాతిరైతె నిద్ధురైనా
రాను రాను పొమ్మంటుంది
నమ్మవే చెలీ నిన్ను
నేను ప్రేమిస్తున్నానే
నా మనస్సులో నిన్ను
నిలిపి పూజిస్తున్నానే
దూరమైతె గుండె
కూడా భారమై పోతుంది
దగ్గరైతే గొంతు దాటి
మాట కూడ రాకుంది
చేరువై కౌగిలిస్తే
ఒదిగి పోవాలని ఉంది
మరుగుతున్న గుండెలోకి
చలువ చేరుకుంటుంది
కళ్ళలోకి చూసావంటే
నీ రూపు కనబడుతుంది
తల్లడిల్లిపోతూ ఉన్నా
మనసు బాధ తెలిసొస్తుంది
కల్ల కాదు నాలో ప్రేమ
ప్రాణమైన అర్పిస్తుంది
నమ్మవే చెలీ నిన్ను
నేను ప్రేమిస్తున్నానే
నా మనస్సులో నిన్ను
నిలిపి పూజిస్తున్నానే
కంటిలోన పాపలా ఉండిపోవే
గుండెలోన ఊపిరై నిండిపోవే
నమ్మవే చెలీ నిన్ను
నేను ప్రేమిస్తున్నానే
నా మనస్సులో నిన్ను
నిలిపి పూజిస్తున్నానే