Vadi Vadiga Song Lyrics – Induvadana (2021)

Vadi Vadiga Song Lyrics, Vadi Vadiga Lyrics Telugu TIRUPATHI JAAVANA, vadi vadiga song sung by singers JAAVID ALI,MALAVIKA music SHIVA KAKANI from album Induvadana

Song Credits:
SONG : VADI VADIGA
SINGERS. MALE: JAAVID ALI,
FEMALE: MALAVIKA
LYRICS: TIRUPATHI JAAVANA
MUSIC: SHIVA KAKANI
Label Credits: Infinitum Music

Vadi Vadiga Song Lyrics – Induvadana (2021)

Vadi Vadiga Song Lyrics :

Vadi Vadiga Song Lyrics

వడి వడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా

సరసర రావే సరాసరి సునామీలా
చుట్టేశావు హడావిడిగా

ఓసినా గువ్వలా చెన్నా
ఊడిపడ్డ వెన్నెల వానా

తోడుకున్న తియ్యనీ తేనా
తననే తందానే తానా

పట్టుకోన మువ్వలా గున్నా
తేలుతున్న తెల్లనీ మైనా

ఆకతాయి అల్లరేదైనా
ఎక్కించేసైనా మేనా

వడివడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూస్తావు భలే భలేగా

ఒక్క చూపుని చూసి
నీళ్ళల్లో తోసి నన్నే ముంచావే

నీ చేతితో తాకి కొత్తగ
మళ్ళీ ఊపిరి పోసావే

పదపద పదమందే
నీ వెనకే నా హృదయం

పదిమందెదురైనా
నీ తోనే నా పయనం

ప్రాణం అయ్యావే
ఆ నిమిషంలో నువ్వే

పాదం కదిలిందే నీ వెంటే
ఆగవే ఆగవే ఆగవే

పడిపడిపోయా ఓ పిల్లా నిన్నే చూసి
పంచ ప్రాణాలిస్తా నీకే పోగేసి

నీ పెదవులు తాకి
తేనెల తీపి నన్నే చేరిందే

నాలోకం దాటి
నీలోకానికి తీసుకువచ్చిందే

మరి మరి మరిచేదే
లేదసలు ఈ సమయం

మది నన్నే విడిచి
నిను చేరే క్షణం

ఎటు చూస్తూ ఉన్నా
కనిపిస్తావు నువ్వే

వెళ్ళిపోమాకే తిరిగి
చూడవే చూడవే చూడవే

వడి వడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూసాక భలే భలేగా

సరసర రా సరే సరాసరి సునామీలా
చుట్టేశావ హడావిడిగా

నేను నీ గువ్వలా చెన్నా
ఊడిపడ్డ వెన్నెల వాన

తోడుకో తియ్యనీ తేనా
తననే తందానే తానా

పట్టుకుంటె మువ్వ నేనేనా
తూలుతున్న తెల్లనీ మైనా

ఆకతాయి అల్లరేదైనా
ఎక్కేస్తా నేను మేనా

వడివడిగా సుడిగాలిగా వచ్చి
గుచ్చి గుచ్చి చూసానా భలే భలేగా

Leave a Reply

error: Content is protected !!
%d bloggers like this: