Oo Aadapilla Song Lyrics, ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా nuvvardham kaavaa lyrics penned by Ananta Sriram composed by Jay Krish sung by singer Ram Miriyala vishwak sen
Song Credits:
Movie – Ashoka Vanamlo Arjuna Kalyanam
Song – Oo Aadapilla
Music – Jay Krish
Lyrics – Ananta Sriram
Singers – Ram Miriyala
Label Credits – Sony Music South
Oo Aadapilla Song Lyrical – Ashoka Vanamlo Arjuna Kalyanam (2022)

Oo Aadapilla Song Lyrics Telugu
మాటరాని మాయవా
మాయజేయు మాటవా
మాటులోని మల్లెవా
మల్లెమాటు ముల్లువా
వయ్యారివా కయ్యారివా
సింగారివా సింగానివా
రాయంచవా రాకాసివా
లే మంచులో లావా నీవా
ఓ ఆడపిల్లా నువ్వర్థం గావా
నా జీవితంతో ఆటాడుతావా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా
బుజ్జి బుజ్జి బుగ్గల్లోన ఎరుపుని
కనుల పులిమావా
చిట్టి చిట్టీ చెక్కిళ్ళలో నునుపుని
నుదుటికియలేవా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నా జీవితంతో ఆటాడుతావా
ఆ ఆఆ
ఆఆ ఆ
పది మంది చూస్తు ఉంటే
అడ్డడ్డే అమాయకంగా
ఒక్కరైనా లేకపోతే
అయ్యయ్యో మరో రకంగా
ఉంటూ నా ఎదనే తింటూ
ఈ కధనే సందేహంలో పడదోయకే
ఏంటో నీ ఇబ్బంది
చెప్పెయ్ ఏమౌతుంది
ఎట్టా అట్టా వెళ్ళిపోకే
తిక్కో టెక్కో
చిక్కో చుక్కో
అసలేదో ఒలిచి చెబుతావా
పట్టో బెట్టో గుట్టో కట్టో
నిజమేదో చెవిన పడనీయ్ వా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
నీతోటి స్నేహం సచ్చేటి సావా
బతిమాలడానికైనా
ఇదిగో తయారుగున్నా
బదులియ్యి నేటికైనా
బతికియ్ ఏదో విధాన
తాకే ఆ తెరపై
దూకే ఓ మెరుపై
నాకై నవ్వే విసిరావే
తీరా నీ ముందుంటే
తీరేలా పొమ్మంటూ
తీరం దాచి తిరిగావే
తప్పో ఒప్పో
గొప్పో ముప్పో
తెలుపక లొసుగులెడతావా
మంచో చెడ్డో కచ్చో పిచ్చో
తెలియక నసిగి నడిచేవా
ఓ ఆడపిల్లా నువ్వర్థం కావా
సంద్రాలనైన ముంచేటి నావా