Acharya Movie Review in Telugu ఆచార్య దర్శకుడు కొరటాల శివ తీసిన సినిమా ఆచార్య
ఆచార్య తారాగణం :
నటీనటులు : చిరంజీవి, రామ్ చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్
నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాతలు: నిరంజన్‌రెడ్డి, అన్వేష్ రెడ్డి, రామ్ చరణ్
దర్శకుడు: కొరటాల శివ
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫి: తిరు
ఎడిటర్: నవీన్ నూలి

దర్శకుడు కొరటాల శివ తీసిన సినిమా ఆచార్య సినిమా కథ ఏంటి అంటే
మహేశ్ బాబు వాయిస్ ఓవర్‌తో ధర్మస్థలి నేపథ్యాన్ని చెప్పించి కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆచార్య ధర్మస్థలిలోకి అడుగుపెట్టడం అటువైపు పాదఘట్టం అనే చిన్న తండా. అక్కడి ప్రజలకు ధర్మస్థలి టెంపుల్‌తో ఎనలేని సంబంధం ఉంటుంది. ధర్మస్థలిలో ఉండే ప్రజలకు ఆయుర్వేద వైద్యం చేస్తూ ధర్మంగా ఉంటారు పాదఘట్టం తండా వాసులు. కానీ ధర్మస్థలి మున్సిపల్ చైర్మన్ బసవన్న చాలా క్రూరుడు. ధర్మస్థలి టెంపుల్‌లో అసాంఘిక కార్యక్రమాలను కొనసాగిస్తూ అక్కడి సొమ్మునంతా కాజేస్తాడు. ధర్మస్థలి అమ్మవారి టెంపుల్‌తో పాటు పాదఘట్టం గ్రామాన్ని కూడా మైనింగ్ మాఫియా లీడర్ రాథోడ్ కు అప్పగించే ప్రయత్నం చేస్తాడు.
ఇలా ధర్మస్థలిలో రౌడీ రాజ్యం ఎక్కువ అవ్వడం తో దాన్ని అడ్డుకోవడానికి ఆ గ్రామానికి వస్తాడు ఆచార్య బసవన్న గ్యాంగ్ చేసే అరాచకాలను ఒక్కొక్కటిగా ఎండగడుతూ ఉంటాడు. అసలు ఆచార్య ఎవరు ధర్మస్థలిని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు ధర్మస్థలితో సిద్ధ కి ఉన్న అనుబంధం ఏంటి ఆచార్యకి సిద్ధకి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే
చివరగా చెప్పాలంటే ధర్మస్థలి టెంపుల్ టౌన్‌ని తెరపై చక్కగా చూపించారు నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
ఆచార్య సినిమా ఒక్కసారి చూడవచ్చు రామ్ చరణ్ తో చిరంజీవి కలిసి చేసారు కబ్బటి ఫ్యాన్స్ కి పండగే
గమనిక – ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు రివ్యూ నా సొంత అభిప్రాయం