Sriranga Neethulu Title Song Lyrics in telugu written by sree mani music composed by ajay arasada song sung by singer sandilya pisapati from latest telugu movie acted by suhas and ruhani sharma, karthik ratnam
Song Credits:
Song Title: Sriranga Neethulu
Music: Ajay Arasada
Singer: Sandilya Pisapati
Lyrics: Sree mani
Label: Sony Music South
Sriranga Neethulu Title Song Lyrics in Telugu
ఇనరా ఇనరా సెపుతా ఇనరా
ఈ కాలం శ్రీరంగ నీతులు ఇనరా
వినరా వినరా సెపుతా వినరా
ఈ కాలం శ్రీరంగనీతులు వినరా
నచ్చింది చేసేటి పోకాడ పోయి
వచ్చింది చేసేటి వైఖరి కనరా
నచ్చింది చేసేటి పోకాడ పోయి
వచ్చింది చేసేటి వైఖరి కనరా
కూసేటి కోడికి లేసేది పోయీ
కూసుందని కోడిని కోసేటి రోజులు
వేమన శతకం కాశికి పోయింది
సుమతీ శతకం
మతిపోయి కూర్చుంది
శతకోటి వింతల విడ్డూరాలే
కొలతల్లా మారాయి
ఈ కాలం కథలే
ఇనరా ఇనరా సెపుతా ఇనరా
ఈ కాలం శ్రీరంగ నీతులు ఇనరా
నచ్చింది చేసేటి పోకాడ పోయి
వచ్చింది చేసేటి వైఖరి కనరా
ఏ నవ్వు ఎనకా ఏ మర్మముందో
కనిపించదే కనిపించదే
ఏ పలుకు ఎనకా ఏ అర్ధముందో
వినిపించదే వినిపించదే
మనసారా మాటాడే వైనాన్ని
చెరిపేయమంటోంది చరవాణి
దిశ లేని దారుల్లో అడుగేసి
గమ్యాలనే గాలికొదిలేసి
ఏ రోజుకారంగేయడం
నేర్చుకుంది లోకమే
ఓ ఓ
ఇనరా ఇనరా సెపుతా ఇనరా
ఈ కాలం శ్రీరంగ నీతులు ఇనరా
వినరా వినరా సెపుతా వినరా
ఈ కాలం శ్రీరంగనీతులు వినరా
నెలసరి జీతాల సొగసులకోసం
పంథాలే పంథాలే
నెలకొక్కసారైనా మనకేం కావాలో
అడగములే చూడములే
లెక్కల తక్కెడ తూకంలో
నువు తప్పిపోయావు ఏనాడో
ఎక్కడికక్కడ రాజీలో
ఈ జీవితంకెన్ని గుంజిల్లో
ఏ సిరులకై నీ పరుగులో
నీకు కూడ తెలియదే
ఇనరా ఇనరా సెపుతా ఇనరా
ఈ కాలం శ్రీరంగ నీతులు ఇనరా
నచ్చింది చేసేటి పోకాడ పోయి
వచ్చింది చేసేటి వైఖరి కనరా