ఓరి వారి నీది గాదురా పోరి లిరిక్స్ – Dasara Ori Vaari (2023)

ఓరి వారి నీది గాదురా పోరి లిరిక్స్ ori vaari telugu lyrics was written by Sreemani song sung and composed by santhosh narayan acted by Nani

Song Credits:
Song: Ori Vaari
Lyrics: Sreemani
Singer: Santhosh Narayanan
Music: Santhosh Narayanan
Label: Saregama Telugu

ఓరి వారి నీది గాదురా పోరి లిరిక్స్

ఓరి వారి నీది గాదురా పోరి
ఇడిసెయ్ రా ఇంగ ఒడిసెను దారి

ఓపారి అవ్వ ఒడిలో దూరి
మరిసెయ్ రా సిన్న మొల్లిగా మారి

బాల్యమే గొప్పది బాధ మర్శిపోతది
చందమామ రాదనే నిజము నమ్మనంటది

చిన్న పల్లీపట్టీకె ఏడుపాపి చూస్తది
కోడె ఈడు సెడ్డది నిజాన్ని కోడై కూస్తది

ఓరి వారి నీది గాదురా పోరి
బజ్జోరా సంటి బిడ్డగా మారి

హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో
హో హో హో హో హో హోహో
హో హో ఓహో హోహో హో

ప్రేమ నాలో దాచిన
చిన్న బొడ్డెమ్మగానే గావురంగా

నిన్ను నేనే వద్దనీ
గిరిగీసుకున్న గింత దెల్వకుంటా

రగిలి నా వేదనే దీపమోలే వెట్టినా
పేర్చినా బతుకమ్మనే
కన్నీళ్ళలో సాగదోలిన
ఇడిచేసి వదిలేశిన

రెక్కలిరిగినట్టి ఈగ
సుడిగాలిలో చిక్కినట్టు
దిక్కు మొక్కు లేని కన్ను
ఎక్కి ఎక్కి ఎడ్శినట్టు

నీకు దగ్గరవ్వలేక
దూరమయ్యే దారిలేక
చితికిపోయే నా బతుకిలా

గుండె పుండు మీద
గొడ్డు కారమద్ది గుద్దుతుంటే
గుక్కపట్టి ఏడవలేని జన్మా

ఓ ఓఓ ఓ ఓఓ ఓ
ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ

Leave a Reply