యెమైఉండచో Yemaiundacho Lyrics in Telugu – Deepthi Sunaina (2022)

యెమైఉండచో Yemaiundacho Lyrics in Telugu song sung and composed music by Vijay Bulganin lyrics penned by Suresh Banisetti

Song Credits:
Singer – Vijay Bulganin
Music – Vijay Bulganin
Lyrics – Suresh Banisetti
Label Credits – Sony Music South

యెమైఉండచో Yemaiundacho Lyrics in Telugu – Deepthi Sunaina (2022)

యెమైఉండచో-Yemaiundacho-Lyrics-in-Telugu-Deepthi-Sunaina-2022

యెమైఉండచో Yemaiundacho Lyrics in Telugu

ఏమైందో ఏమో గాని
ఎపుడు లేని ఈ మనసే

చిరునామ లేనే లేని
లేఖలేవో రాసే

ఏమైందో ఏమో గాని
ఎపుడు లేదే ఈ వరసే

ఏ గమ్యం లేనే లేని
అడుగులేవో వేసే

క్షణమైనా కుదురుండలేని
కొత్త దోబూచులాటే ఇది

ఎవరైనా గమనించలేని
మూడు హృదయాల గొడవే ఇది

రెక్కలు ఉండి ఎగిరెళ్లలేని
చిక్కులుపడ్డ ఓ పిట్ట కధ ఇది

ఏమైందో ఏమో గాని
ఎపుడు లేని ఈ మనసే

చిరునామ లేనే లేని
లేఖలేవో రాసే

ఏమైందో ఏమో గాని
ఎపుడు లేదే ఈ వరసే

ఏ గమ్యం లేనే లేని
అడుగులేవో వేసే

ప్రేమ అనొచ్చో పిచ్చి అనొచ్చో
మైకమనొచ్చో మాయ అనొచ్చో

బాధ అనొచ్చో బెంగ అనొచ్చో
ఇంకేమనొచ్చో ఏమై ఉండొచ్చో

నీ చిన్ని గుండెలో ఉన్నదేమిటో
చెప్పనివ్వదే దాచనివ్వదే

నీ చిన్ని ప్రాణమే చిత్రహింసలో
ఊగుతున్నదే

ఏ ఏఏ

నీ చిన్ని ఆశకి తీరమెక్కడో
దారి దోచదే దిక్కు తోచదే

నీ చిన్ని జన్మకి అర్థమేమిటో
అర్దమవ్వదే

ఏ ఏ ఏ

తొంగి చూడ్డాలు పొంగిపోడాలు
ఏమి లేకుండా ఎన్నాళ్ళో

కొంటె భావాలు కూని రాగాలు
బయట పడకుండా ఎన్నేళ్లో

ఈ కలలే ఉప్పొంగే సంద్రాలే
తప్పుకోలేక ఎన్నెన్ని గండాలే

మనసంతా గందరగోళాలే
చెప్పుకోలేని నిప్పుల గుండాలే

ప్రేమ అనొచ్చో పిచ్చి అనొచ్చో
మైకమనొచ్చో మాయ అనొచ్చో

బాధ అనొచ్చో బెంగ అనొచ్చో
ఇంకేమనొచ్చో ఏమై ఉండొచ్చో

ఏమైందో ఏమో గాని
ఎపుడు లేని ఈ మనసే

చిరునామ లేనే లేని
లేఖలేవో రాసే

ఏమైందో ఏమో గాని
ఎపుడు లేదే ఈ వరసే

ఏ గమ్యం లేనే లేని
అడుగులేవో వేసే

అడుగంత దూరాన ఉన్న
అందుకోలేని తీరేమిటో

ఎంతెంత దగ్గరగా ఉన్నా
దగ్గరవలేని స్థితి ఏమిటో

గుప్పెడు గుండె చప్పుళ్ళ తగువ
తీర్చడమంటే అది అంత సులువా

ప్రేమ అనొచ్చో పిచ్చి అనొచ్చో
మైకమనొచ్చో మాయ అనొచ్చో

బాధ అనొచ్చో బెంగ అనొచ్చో
ఇంకేమనొచ్చో ఏమైఉండొచ్చో

Leave a Reply