Addedu Addedu 2 Song Lyrics in Telugu – Sytv Folk Song (2023)

అడ్డెడు అడ్డెడు అల్లీపూలు అత్తా మామలు సారె పోయంగా lyrics in telugu written by thirupathi Matla sung by singer madhu priya latest folk song from sytv

Song Credits:
Song- Addedu Addedu 2
Lyrics- Thirupathi Matla
Music- Thirupathi Matla
Singer- Madhupriya
Label- Sytv

Addedu Addedu 2 Song Lyrics in Telugu

ఎసో ఎసో ఎసోదాన ఎసోదాన
ఎసో ఎసో ఎసోదాన ఎసోదాన

అడ్డెడు అడ్డెడు అల్లీపూలు
అత్తా మామలు సారె పోయంగా
అత్తా మామలు సారె పోయంగా

తవ్వెడు తవ్వెడు తాలీపూలు
తల్లీదండ్రులు సారె పోయంగా
తల్లీదండ్రులు సారె పోయంగా

ఎసో ఎసో ఎసోదాల మేనత్తకొడుకో
ఏలువట్టి కోలు తిరుగుదామా
నా ముత్యాల కొడుకో

డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి
గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

అహ తెల్లాజీర తెల్లా రైక
తెల్లారంగ గట్టుకొని
మాడబిళ్ళ నేను వెట్టుకొని

సెవులకు కమ్మలు
సేతికి గాజులు సింగారంగ వెట్టుకొని
నేను సిక్కులు సేత వట్టుకొని

ముసిముసిగా నవ్వుకుంటు
ముస్తాబై వస్తుంటే
సిగ్గులమొగ్గ నీ అందం
సూడ సక్కదనమన్నాడే

డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి
గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి
గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

జిలకర బెల్లం కలిపి
నెత్తీమీద వెట్టంగా
నా మెత్తని కాళ్ళు తొక్కంగా

నా సెయ్ నీ సేతుల వెట్టి
తోడునీడగుందామా అని
కన్యాదానం సెయ్యంగా

కలకాలం కలిసుండాలని
తలంబ్రాలు పోయంగా
మేళాతాళాల నడుమ
మన మనువు గావాలా

డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి
గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి
గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

ముత్యాలపందిరి కింద
సుట్టాలందరు సూడంగ
మన ఇద్దరి పెండ్లి జరగంగా

దేవాన దేవుళ్ళందరు
మన దిక్కు సూడంగ
నా మెడలో పుస్తె కట్టంగా

బతుకంతా పచ్చగ ఉండాలని
పసుపు బియ్యము పొయ్యంగా
పంచభూతాల సాక్షిగా
మనమిద్దరమొక్కటి గావాలా

డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి
గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి
గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

నన్నుగన్న నా అయ్యవ్వనిడిసి
అత్తారింటికి జేరంగా
నా అప్పగింతలు సెయ్యంగా

పుట్టీనింటినిడిసిపెట్టి
మెట్టీనింటి గడపలోన
కుడికాలు మోపంగా

తోడీకోడండ్ల నడుమ
నట్టింట్లో తిరగంగా
ఇంటికి సిన్నా కోడలినాని
కంటికి రేప్పొలే సూడాలా

డడ్డనక డన్ డడ్డనక డన్
డోలూ సన్నాయి
గుండెల్లో మోగుతుందోయి
గుండెల్లో మోగుతుందోయి
నీ దిక్కు లాగుతుందోయీ

ఎసో ఎసో ఎసోదాన ఎసోదాన
ఎసో ఎసో ఎసోదాన ఎసోదాన

Leave a Reply