Chakraallanti Song Lyrics in Telugu – Japan (2023)

Chakraallanti Song Lyrics in Telugu written by bhaskara bhatla చక్రాల్లాంటి కళ్ళే తిప్పి telugu song sung by singer haricharan music composed by GV Prakash Kumar latest telugu version movie Japan acted by Karthi

Song Credits:
Singer: Haricharan
Lyrics: Bhaskara Bhatla
Music: GV Prakash
Song: Chakraallanti
Label: Saregama Telugu

Chakraallanti Song Lyrics in Telugu

చక్రాల్లాంటి కళ్ళే తిప్పి
పిల్లా పిల్లా చూడకలా

ని చూపుల్లో చిక్కుకుపోతేయ్
నేరం నాది కాదు కదా

నాలో వున్న నన్నే తోడే
నిన్నే నింపేస్తున్నావే
చాక్కెరలాంటి నా ప్రాణాన్నీ
చీమై తినేస్తున్నావే

గుడిసె మీద పువ్వై
పూసావే ఏ ఏ
గుండెమీద గువ్వై
వాలావే ఏ ఏ

గడ్డీపోచ తలనే నిమిరే
మంచూబొట్టు మురిపెం నువ్వు

ఊరిచివర గుళ్లో
వెలిగే దీపం నువ్వేనే

గంజీలోన ఆబగ వెతికే
అన్నం మెతుకు రూపం నువ్వు

గొంతే ఎండిపోతూ ఉంటే
మేఘం నువ్వేనే

మట్టీలోన చెయ్యే పెడితే
మాణిక్యంలా దొరికావే

ఆకాశమో ఎగిరేలాగా
ఆశకి రెక్కలు తొడిగావే

నా పక్కనే నువ్వుండగా
నాకెందుకే ఈ లోకం
నువ్వే కదా నా లోకం

హే దారి తప్పి
దిక్కులు చూసే
నల్లా మేకపిల్లని నేనూ

సుతారంగా ధూవ్వీ ధూవ్వీ
ప్రేమని పంచావే

చిల్లే పడ్డా గొడుగే నేనూ
పిల్లా నువ్వే అతుకయ్యావూ

వడ్లగింజ లాంటి నన్నే
మెల్లగా వలిచావే

కాకెంగిలే చేసిచ్చావో
అమృతమే కదా ఏదైనా

నా కళ్ళకి నువ్వు కాకుండా
అద్భుతం ఇంకోటుండేనా

ఆల్చిప్పలో ముత్యానివై
దక్కావులే బంగారం
బాగున్నదే నీ గారం

చక్రాల్లాంటి కళ్ళే తిప్పి
పిల్లా పిల్లా చూడకలా

ని చూపుల్లో చిక్కుకుపోతేయ్
నేరం నాది కాదు కదా

నాలో వున్న నన్నే తోడే
నిన్నే నింపేస్తున్నావే
చాక్కెరలాంటి నా ప్రాణాన్నీ
చీమై తినేస్తున్నావే

గుడిసె మీద పువ్వై
పూసావే ఏ ఏ
గుండెమీద గువ్వై
వాలావే ఏ ఏ

Leave a Reply