Chenguna Chenguna Song Lyrics – Varudu Kaavalenu (2021)

Chenguna Chenguna Song Lyrics, chenguna chenguna lyrics penned by sreemani song sung by singer sinduri music composed by vishal chandrashekhar

Song Credits:
Song: Chenguna Chenguna
Singer: Sinduri
Music: Vishal Chandrashekhar
Lyrics: Sreemani
Label Credits – Aditya Music

Chenguna Chenguna Song Lyrics – Varudu Kaavalenu (2021)

Chenguna-Chenguna-Song-Lyrics-Varudu-Kaavalenu-2021

Chenguna Chenguna Song Lyrics Telugu

చెంగున చెంగున
నల్లని కనుల రంగుల వాన

చిరు చిరు నవ్వుల మువ్వలు
చిందులు చిందెను పెదవుల పైన

ఎర్రని సిగ్గుల మొగ్గలు
మగ్గెను బుగ్గలలోన

ముసిరిన తెరలు తొలిగి
వెలుగు కురిసె వెన్నెలతోన

మళ్ళీ పసిపాపై పోతున్నా
తుళ్ళి తుళ్లింతలతో తెల్లాన

వెల్లే ప్రతి అడుగు నీవైపేనా
మళ్ళీ ప్రతి మలుపు నిను చూపేనా

ప్రాయమంత చేదేననుకున్నా
ప్రాణమొచ్చి పువ్వులు పూస్తున్నా

నాకు తగ్గ వరుడేడనుకున్నా
అంతకంటే ఘనుడిని చూస్తున్నా

నా ఇన్ని నాళ్ళ మౌనమంతా
పెదవంచు దాటుతుంటే
తరికిట తకధిమి నేడిక నాలోనా

ఎలాగ ఇప్పుడు మలుపు తిరుగును
ప్రయాణమన్నది తెలుపుగలమా

ఎలాగ ఎవ్వరు పరిచయాలే
ఏ తీరుగ మారునో చెప్పగలమా

ఎలాగ ఇప్పుడు మలుపు తిరుగును
ప్రయాణమన్నది తెలుపుగలమా

ఎలాగ ఎవ్వరు పరిచయాలే
ఏ తీరుగ మారునో చెప్పగలమా

మేఘం నీది కడలి ఆవిరిదే కాదా
కురిసే వానై తిరిగి రాదా

ఆ ఆ

నాలో మెరిసే మెరుపు మరి నీదే కాదా
మళ్ళీ నిన్నే చేరమంటోందా

ప్రశ్నలు ఎన్నో
నా మనసు కాగితాలు

బదులిలా సులువుగా
దొరికెను నీలోనా

ఎలాగ ఇప్పుడు మలుపు తిరుగును
ప్రయాణమన్నది తెలుపుగలమా

ఎలాగ ఎవ్వరు పరిచయాలే
ఏ తీరుగ మారునో చెప్పగలమా

తనాన తన న న

Leave a Reply