Chinnari Thalli Song Lyrics – Viswasam
Chinnari Thalli Lyrics :
Chinnari Thalli Song Lyrics – చిన్నారి తల్లి
Chinnari Thalli Song Lyrics In Telugu
Song Credits :
Movie: Viswasam
Singer: Satya Prakash
Music: D. Imman
Lyrics: Ramajogayya Sastry and Label Credit : MRT Music
చిన్నారి తల్లీ చిన్నారి తల్లీ నా నింగి జాబిలీ
నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండె లోగిలి
నీ ఊసులోనే ముసరాడుతోంది ఈ నాన్న ఊపిరి
కాలాలు ధాటి ఏనాటికైనా చేరాలి నీ ధరి
ఎన్నాళ్ళు ఉన్నానంటే ఉన్నానంటూ ఏకాకి మాదిరి
ఆరారీరారో రారో
రారో ఆరారీరారో
ఆరారీరారో రారో
రారో ఆరారీరారో
చిన్నారి తల్లీ చిన్నారి తల్లీ
నా నింగి జాబిలీ
నీ వెన్నెలంది వెలుగొందుతోంది
నా గుండె లోగిలి
కను చివరన జారే తడి చినుకును సైతం
సిరితలుకుగా మార్చే చిత్రం నీవే
కలతగపొర మారే ఎద మంటల గ్రీష్మం
సులువుగా మరిచే మంత్రం నీవే…
నువ్వంటే నా సొంతమంటూ పలికిందీ మమకారం
ఆ మాటే కాదంటూ దూరం నిలిపిందే అహంకారం
తలవాల్చి నువ్వలా ఒడిలోన వాలగా
నిండు నూరేళ్ళ లోటు తీరిపోదా అదే క్షణానా
చిన్నారి తల్లీ చిన్నారి తల్లీ నా నింగి జాబిలీ
నీ వెన్నెలంది వెలుగొందుతోంది నా గుండె లోగిలి
నిదురించు వేల నీ నుదుట నేను ముత్యాల అంజలీ
జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి
ఏ బూచి నీడ నీపై రానీకుండా నేనేగా కావలి
ఆరారీరారో రారో రారో ఆరారీరారో
ఆరారీరారో రారో రారో ఆరారీరారో
చిన్నారి తల్లీ
చిన్నారి తల్లీ…