Choodu Nanna Song Lyrics in Telugu written by bhaskarabhatla ravi kumar music composed by santhosh narayan song sung by singer vijaynarain from latest telugu movie yatra 2 acted by Jiiva
Song Credits:
Lyrics: Bhaskarabhatla Ravi Kumar
Singers: Vijaynarain
Music: Santhosh Narayanan
Song: Choodu Nanna
Label: Saregama Telugu
Choodu Nanna Song Lyrics in Telugu
చూడు నాన్న
చూస్తున్నావా నాన్నా
నీడ లేని నేనా వీళ్ళ ధీమా
ఏమిటీ ఇంతటి ప్రేమా
నా దారెటో తోచకుంటే
నీ వెంబడే మేము అంటూ
కదిలారు ఏంటో ఆ నమ్మకం
నేనెలా ఒడ్డుకి చేరడం
వీళ్ళనెలా ఒడ్డుకి చేర్చడం
ఇంటి పెద్దా కన్నుమూస్తే
అయినవాళ్ళు అనాధలే కదా
నువ్వే లేకా ప్రతి ఊరు ఊరు
అనాధ అవ్వడం ఏందయ్యా
ఇది ఏనాడు
జరిగుండదయ్యా ఓ పెద్దయ్యా
ఇందరి కన్నులు
చిమ్మే కన్నీటినంతా
తుడవాలనుంది కొడుకుగా
అందుకు అవసరమయ్యే
కొండంత ధైర్యం నాకు ఇవ్వవా
నేనెలా బాధని మింగడం
వీళ్ళనెలా నే ఓదార్చడం
ఎంతలా అభిమానం
కురిపిస్తున్నారో ఈ జనం
అందుకే ఈ జన్మలో
తీర్చేసుకుంటా ఈ రుణం
గడపకి ప్రతి గడపకి
నేనవుతా రక్షా తోరణం
మాటపై ఉంటానని
చేస్తున్నా తొలి సంతకం
చూడు నాన్న చూడు నాన్న
చూడు నాన్న చూడు నాన్న
చూడు నాన్న చూడు నాన్న
చూడు నాన్న చూడు నాన్న