Ennenno Janmala Bandham Song Lyrics

Ennenno Janmala Bandham Song Lyrics in Telugu

Song Credits :
Song : Ennenno janmala
Lyrics : Raajan Nagendran 
Movie: Pooja
Singers: S.P. Bala Subramanyam గారు , Vani Jayaram గారు
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది… ఎన్నటికి మాయని మమతా నాది నీది 
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను.. ఒక్క క్షణం నీ విరహం నేతాళలేను 
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది… ఎన్నటికి మాయని మమతా నాది నీది 
పున్నమి వెన్నెలలోన పొంగును కడలి… నిన్నే చూసినవేళ నిండును చెలిమి 
నువ్వు కడలివైతే నే నదిగ మారి చిందులు వేసి వేసి నిన్ను చేరనా  చేరనా  చేరనా…
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది… ఎన్నటికి మాయని మమతా నాది నీది 
విరిసిన కుసుమము నీవై మురిపించేవు.. తావి నేనై నిన్ను పెనవేసేను 
మేఘం నీవై  నెమలిని నేనై ఆశతొ నిన్ను చూసి చూసి ఆడనా.. ఆడనా.. ఆడనా..
ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది… ఎన్నటికి మాయని మమతా నాది నీది 
కోటి జన్మలకైన కోరేదొకటే.. నాలొ సగమై ఎపుడు నేనుండాలి 
నీవున్నవేళ ఆ స్వర్గమేలా ఈ పొందు ఎల్లవేళలందు ఉండనీ.. ఉండనీ.. ఉండనీ..
ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది… 
ఎన్నటికి ఎన్నటికి మాయని మమతా నాది నీది 
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను.

Leave a Reply