Harom Hara Song Lyrics – Weekend Party (2022)

Harom Hara Song Lyrics latest telugu song harom hara from weekend party movie composed by sada chandra

Song Credits:
Song: Harom Hara
Singer : Shankar Mahadevan
Lyrics & Music: Sadachandra
Label Credits: Tips Telugu

Harom Hara Song Lyrics Telugu

ఓహొ హో ఓ ఓ
ఓహొ హో ఓ ఓ

హరా హరా హరా హరా
హరా హరా హరా
హరోం హరా హరోం హరా

పరుగులు తీసే యవ్వనం
పెను ప్రమాదమున తోసే

ఉరకలు వేసే ప్రాయమే
ఉరితాడై మెడ బిగిసే

పరుగులు తీసే యవ్వనం
పెను ప్రమాదమున తోసే

ఉరకలు వేసే ప్రాయమే
ఉరితాడై మెడ బిగిసే

కఠినమైనది కాలం నడక
కత్తులు దూసెను ముందెనక

జఠిలమైనది జీవన చెరక
ఏ క్షణమాగునో తెలియదిక

తెలిసిన దేవర హరోం హరా
జరిగెను ఘోరం హరోం హరా

తెలుపర ఫలితం హరోం హరా
హరోం హరా

ప్రేమను చూపర హరోం హరా
ప్రాణము నిలుపర హరోం హరా

తీరము చేర్చరా హరోం హరా హరోం హరా
హరోం హరా హరోం హరా

అమృతమే హాలాహలమై
ఆయువునే బలికోరినదే

అనురాగం అపశృతి పలికిన
ఆవేదన రాగమిదే

హద్దులు మీరి స్వేచ్ఛను కోరే
బుద్దే మనసున పుట్టిందా

రెచ్చిన కోరిక పిచ్చితనంతో
కామపు చిచ్చుల కాల్చినదా

కన్నవారికి హరోం హరా
కలతలు మిగిలెను హరోం హరా
చితికిన బ్రతుకులు
హరోం హరా హరోం హరా

గమ్యం మరిచిరి హరోం హరా
పయనం ఇదికదా హరోం హరా

చివరకు ఎవరవు
హరోం హరా హరోం హరా
హరోం హరా హరోం హరా

ఆశయాన్ని విడిచిన యువత
అడ్డదారి పయనిస్తుంటే

కనులుండి మన ఈ సంఘం
కబోధిలా చూస్తు ఉంటే

భావితరాల భవితవ్యానికి
బ్రతుకే చిక్కుల ప్రశ్నవదా

కారగారపు ఖైదీగ నిలిచి
చీకటిమూగిన చరితవదా

యాతన తీర్చరా హరోం హరా
చేయూత ఇవ్వరా హరోం హరా
చేతన చూపరా
హరోం హరా హరోం హరా

సత్యం తెలిసిన హరోం హరా
సాక్ష్యం నీవుగా హరోం హరా

మోక్షం ఇవ్వరా
హరోం హరా హరోం హరా
హరోం హరా హరోం హరా

Faq – Harom Hara Song

Harom Hara Song Singer Name?

Shankar Mahadevan

who wrote telugu lyrics హరోం హరా Song?

Sadachandra

Harom hara Song Movie Name?

Weekend Party Telugu

Leave a Reply