Jodedla Bandi Song Lyrics జోడెడ్ల బండే రథమై మోసిందే telugu lyrics written by Kittu Vissapragada sung by singers Mohana Bhogaraju, Phani Kalyan composed by phani kalyan
Song Credits:
Song : Jodedla Bandi
Music : Phani Kalyan
Lyrics : Kittu Vissapragada
Singers : Mohana Bhogaraju, Phani Kalyan
Label Credits – Aditya Music
Jodedla Bandi Song Lyrics Jaitra (2022)
Jodedla Bandi Song Lyrics in Telugu
జాబిల్లి కూన ఆకాశాన
తలవంచి నేడు సూసే
ఎందెలలాగ నేలే జారి
రెండు లోకాలు కలిసే
మామా సందమామ
ఓ పట్టు సీరె కట్టుకున్న
పంట సేను ఊగినట్టు
మెరిసే సీతమ్మా
పైరగాలి సెంత సేరి
బుగ్గ గిల్లి నవ్వినట్టు
సూసే రామయ్యా
వచ్చి పైన వాలుతుంటె
ఎల్లకీల పల్లకీల మంచె మారిందే
జంటే కట్టేలా కన్నె
మనసే మురిసిందే
గడ్డిపోసపై సిన్ని సినుకై
సేరి మెరిసిందిలే
పచ్చి నేలే పంటై పండిందిలే
హే హే హే హే
జోడెడ్ల బండే రథమై మోసిందే
సెటా పటై ఏటి గట్టే సాగి పోయే
జోడెడ్ల బండే రథమై మోసిందే
సెటా పటై ఏటి గట్టే సాగి పోయే
ఓ సీమ గాలే ఈలే ఏసిందా
ఓ పల్లెటూరే ఇల్లై మారిందా
పాడే ఆస్తిపాస్తులైతే పాలే
పంచభక్షమైతే సాలే
ఇన్ని ఉన్న వాడు రాజే
ఓ నేలకొరిగేటి ఆ మిన్ను ఏమన్నదో
విత్తు దాసేటి ఈ మన్ను ఏం విన్నదో
నీ సంకనెక్కిన పంట ఈరి బిడ్డలే
జోడెడ్ల బండే రథమై మోసిందే
సెటా పటై ఏటి గట్టే సాగి పోయే
మిద్దెల్లోన ఏకాంతాల
బతుకే సేదు మాయరా
ప్రేమించేటి మనిసే ఉంటె
గుడిసే పర్ణశాలరా
ఓ రైతు సెమటదారలో
పైడి కాంతి సూడగా
ఆదరించి సేద తీర్సు
ఆలి అమ్మ కాదా
వచ్చి పైన వాలుతుంటె
ఎల్లకీల పల్లకీల మంచె మారిందే
జంటే కట్టేలా కన్నె
మనసే మురిసిందే
గడ్డిపోసపై సిన్ని సినుకై
సేరి మెరిసిందిలే
పచ్చి నేలే పంటై పండిందిలే
హే హే హే హే
జోడెడ్ల బండే రథమై మోసిందే
సెటా పటై ఏటి గట్టే సాగి పోయే
జోడెడ్ల బండే రథమై మోసిందే
సెటా పటై ఏటి గట్టే సాగి పోయే