Kammaguntadhey Song Lyrics – Ahimsa (2022)

Kammaguntadhey Song Lyrics Times Music South and Anandi Arts Creations presents New Telugu film Lyrics “Kammaguntadhey” from the film AHIMSA, sung by Kala Bhairava, Keerthana Srinivas and music given by R.P. Patnaik

Song Credits:
Song : Kammaguntadhey
Singers: Kala Bhairava, Keerthana Srinivas
Music: R.P.Patnaik
Lyrics : Chandrabose
Label Credits – Junglee Music South

Kammaguntadhey Song Lyrics Telugu

పత్తి సేనులో దూదిని ఏరి
దూది మొత్తము బుట్టలో కూరి
బుట్ట దూది రాట్నంపై వడికి
తెల్లతెల్లని నూలుని తీసి

నూలునంత నేతన్నకు ఇచ్చి
నేతగాడు ఓ కోకను నేసి
కోటి పువ్వుల రంగులు తీసి
కోకపైన సింగారిస్తే

ఆ కోక నువ్వు కట్టుకుంటే
ఆ కొంగు నాకు తగిలిస్తే

కమ్మగుంటదే పిల్ల కమ్మగుంటదే
కమ్మగుంటదే ప్రేమే కమ్ముకుంటదే

వంట ఇంటిలో వాడిన నీటికి
పెరటిలోన నేలంతా తడిసి
పచ్చి నేలలో పెరిగిన ఎరలను
ఎంచి ఎంచి గాలానికి గుచ్చి

పెద్ద చేపలను పట్టుకు వచ్చి
మట్టి కుండలో పులుసును వండి
బువ్వలోన ఆ కూరను కలిపి
గోరు ముద్దలను తినిపిస్తుంటే

నా గొల్లు నీకుతాగిలిస్తే
నా వెల్లు నువ్వు కొరికేస్తే

కమ్మగుంటదే
బావ కమ్మగుంటదే
కమ్మగుంటదే
యెంతో కమ్మగుంటదే

నాటు పడవలో కడలికి వెళ్లి
కడలిలోని ఆ లోతులు తడిమి
లోతులోని ముత్యాలను వేతికి
లేతవాణ్ణి దోసిలిలో నింపి

తీసుకొచ్చి కంసాలికి ఇచ్చి
మెరుగు దిద్ది మెరుపులు అద్ది
గొలుసులోని ఆ పూసలు గుచ్చగా
మనసు ధరమే అయిపోతుంటే

ఆ గొలుసు నువ్వు సుట్టుకుంటే
నా మనసు నిన్ను ముట్టుకుంటే

కమ్మగుంటదే పిల్ల
కమ్మగుంటదే కమ్మగుంటదే
గుండెకు నెమ్మేదుంటాదే

నల్ల మట్టిలో నీరే పోసి
మెల్ల మెల్లగా మెత్తగా కలిపి
బొజ్జ గణపతి బొమ్మను చేసి
చిట్టి కుడుము నైవేద్యం పెట్టి

తనివి తీరగ ఆరాధించి
యేలికపై తననూరేగించి
మట్టిలో పుట్టిన ఆ బొమ్మను
మట్టిలోన కలిపినట్టు

మట్టి నుండీ మొదలెట్టి
మట్టి వరకు కలిసుంటే

మట్టి నుండీ మొదలెట్టి
మట్టి వరకు కలిసుంటే

కమ్మగుంటదే బావ కమ్మగుంటదే
కమ్మగుంటదే జన్మకు నమ్మికుంటదే

Faq – Kammaguntadhey Song

Who is the singer of Kammaguntadhey Song?

Kala Bhairava, Keerthana Srinivas

Who wrote telugu lyrics of Kammaguntadhe Song?

Chandrabose

Movie name of Kammaguntadhe Song?

Ahimsa Telugu

Leave a Reply