korameesam polisoda song lyrics in telugu given by Ramjogayya sastry korameesam polisoda lyrics song sung by Ramya Behara and music given by thaman s
Song Credits :
Lyrics – Ramjogayya sastry
Singer – Ramya Behara
Song – Korameesam Polisoda
Label – Lahari Music | T-Series
Music – Thaman S
ఏ జనమలో నీకు ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది ఏరి కోరి వెతికి
నీ అండ చూసింది నెత్తెక్కి కూర్చుంది
నన్నెల్లి పొమ్మంది సవతి…!!
రవ్వంత నీ పక్క సోటివ్వనంటుంది పోట్లాటకొస్తుంది దండెత్తి
ఆ సంగతేందో ఓ కాస్త… నువ్వే తేల్చుకోరా పెనిమిటీ…
కోరమీసం పోలీసోడా నన్ను కొంచం చూసుకోరా
గుండె మీది నక్షత్రంలా నన్ను నీతో ఉండనీరా
ఏ జనమలో నీకు ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది ఏరి కోరి వెతికి
పనిలో పడితే నీకేది గురుతురాదు
నువ్వలా వెళితే నాకేమో ఊసుపోదు
పలవరింత పులకరింత చెరొక సగముగా
సమయమంతా నీవే ఆక్రమించినావురా
ఏ గుళ్లో ఏ గంట వినిపించినా గానీ నిన్నేగా నే తలచుకుంటా
మెల్లోని సూత్రాన్ని ముప్పొద్దు తడిమేసి నీ క్షేమమే కోరుకుంటా
నా లోకమంతా సంతోషమంతా నీతో ఉన్నదంటా
కోరమీసం పోలీసోడా నన్ను కొంచం చూసుకోరా
గుండె మీది నక్షత్రంలా నన్ను నీతో ఉండనీరా
ఏ జనమలో నీకు ఏ మందు పెట్టిందో
నీ జంట కట్టింది ఒంటి మీది ఖాకీ
అసలంటూ తానంటూ నీ కొరకే పుట్టిందో
నీ తలపు తట్టింది ఏరి కోరి వెతికి..