Maa Ooru Ambajipeta Song Lyrics in telugu written by rahaman music composed by sekhar chandra song sung by singer kaala bhairava from latest telugu movie ambajipeta marriage band acted by Suhas
Song Credits:
Song: Maa Ooru Ambajipeta
Singer: Kaala Bhairava
Lyrics: Rahaman
Music: Sekhar Chandra
Choreographer: Moin
Label: Sony Music South
Maa Ooru Ambajipeta Song Lyrics in Telugu
రారోయ్ మా ఊరి
సిత్రాన్ని సూద్దాం అరెరే సూద్దాం
ఇటు రారోయ్
ఈ బతుకు పాటను ఇందాం
అరెరే ఇందాం
ఈ సన్నాయి నొక్కుల్లోనా
ఊరించే సంగతులెన్నో ఉన్నాయ్
ఈ డప్పుల చప్పుడులోన
ఊగించే గుండె
లయలు ఉన్నాయి
సేతుల్లో సేతల్లో
కలలెన్నో ఉన్నోళ్ళు
ముత్తాతల వృత్తులనే సేసేటోల్లు
బంధాలు బాధ్యతలు మోస్తున్నా
మొనగాళ్ళు మా
ఊరి విద్వాంసులు
మా ఊరు అంబాజీపేటా ఆ ఆ
మా ఊరు అంబాజీపేట
మా బతుకే సరికొత్త బాట
మా ఊరు అంబాజీపేట
కొట్టర కొట్టు
ఊరంతా మురిసి ఆడాలంటా
కష్టాలు కన్నీళ్ళు
వద్దన్నా వదులునా
ఉసూరుమన్నావో
నీ బండి కదులునా
కష్టాలు కన్నీళ్ళు
వద్దన్నా వదులునా
ఉసూరుమన్నావో
నీ బండి కదులునా
తీపైనా సేదైనా
రుచి చూడక తప్పునా
కాదంటే బతుకంతా
తీరాని ఓ యాతన
తీరాని ఓ యాతన
తీరాని ఓ యాతన
లోకం అంటేనే
సంత కాదా సోదరా
మంచేదో సెడ్డేదో
కళ్ళే తెరిచి సూడరా
కాలం అంటేనే
మాయ కదా నాయనా
నిన్న నేడు రేపు ఒకేలాగ ఉండేలా
రా ఇలా ఇలా
పుట్టిన రోజును చేద్దాం
రా అలా అలా
పాడెను ఎత్తుకు పోదాం
రా ఇలా ఇలా
మధ్యలో మనుషులౌదాం
ప్రతి కధకి మనమే
సాక్షాలౌదాం
మా ఊరు అంబాజీపేటా ఆ ఆ
మా ఊరు అంబాజీపేట
మా బతుకే సరికొత్త బాట
మా ఊరు అంబాజీపేట
కొట్టరా కొట్టు
ఊరంతా మురిసి ఆడాలంటా
రారోయ్
మా ఊరి సిత్రాన్ని సూద్దాం
అరెరే సూద్దాం
మనసారా
ఈ బతుకు పాటను విందాం
అరెరే ఇందాం