Mangli Rani Song Lyrics in Telugu

Mangli Rani Song Lyrics in Telugu latest folk song sung by singer mangli song choreographed by jany composed by madeen SK lyrics written by kamal eslavath

Song Credits:
Singer- Mangli
Lyrics- Kamal Eslavath
Cherographer – Janu lyri
Music- Madeen SK
Label Credits: Mangli Official

Mangli Rani Song Lyrics in Telugu

రాణి రంగు చీర సుట్టి
అల్లిపూల మాల కట్టి
రేగు పళ్ళ చెట్టు కింద కుసోనుంటిరా

రాకుమార సెయ్యి పట్టి
గావురంగా సుట్టుముట్టి
పానమెత్తు చూసుకోను కాసుకుంటిరా

వేగిల్లు పారుతుంటే
వెన్నెలా జారుతుంటే

కళ్ళే కళ్ళార్పకుండా నిన్నే నింపేసుకుంటే
రావేలా ఈ వేళా ఉయ్యాలలూగుదాము

కొండా కోన కొమ్మలంచునా
సిలకల్లే కూడి పచ్చనాకు పూల చెంతనా

కొండ కోన గువ్వలంచునా
సిలకల్లే కూడి పచ్చనాకు పూల చెంతనా

రాణి రంగు చీర సుట్టి
అల్లిపూల మాల కట్టి
రేగు పళ్ళ చెట్టు కింద కుసోనుంటిరా

రాకుమార సెయ్యి పట్టి
గావురంగా సుట్టుముట్టి
పానమెత్తు చూసుకోను కాసుకుంటిరా

నల్లాని కోయిలమ్మా
తెల్లాని పావురమ్మా
రారమ్మనంటూ నిన్ను పిలిచి అలిసేరా

రాగాల రావి కొమ్మా
వేలాడు ఊడలమ్మ
నీ అడుగు అలికిడింటే నీడ కరుసురా

కొల కళ్ళ కోమలాంగి
నీవేనా తీరు వలపులున్నా సుందరాంగినీ

ఊసులెన్నో మోసుకొస్తిని లేత పూల
తేరునయ్యి చేరుకుంటివి

పారేటి వాగు వంక
పాడే గువ్వా గోరింకా
నిన్నటు చూసినంకా
మనసాయే కృష్ణ జింకా

పువ్వల్లె మువ్వల్లే
ఇవ్వాలె చుట్టుకోరా
సోకు సిగ్గు ఒగ్గలేసనా
నీ చూపు తాకి పడుచు పాల బుగ్గలంచునా

సోకు సిగ్గు ఒగ్గలేసనా
నీ చూపు తాకి పడుచు పాల బుగ్గలంచునా

రాణి రంగు చీర సుట్టి
అల్లిపూల మాల కట్టి
రేగు పళ్ళ చెట్టు కింద కుసోనుంటిరా

రాకుమార సెయ్యి పట్టి
గావురంగా సుట్టుముట్టి
పానమెత్తు చూసుకోను కాసుకుంటిరా

నోరారా పిలుచుకున్న
గుండెల్లో నిలుపుకున్న
ఊరేగే ఊహలో ఊరిస్తావేందిరా

ఓసారి అడుగుతున్న
వేయిసారి అలుగుతున్న
ఈసారి ఆయినా వచ్చి పోతే ఏందిరా

ఓరకంట సుత్తవెందుకో
దొర దొర చూపులల్లే నన్ను దోచుకో

కొంటె మాటలప్పచెప్పుకో ఏరికోరి
చిన్నదాని జంట చేరుకో

పరువాల పరుగులంతా
మురిపాల ముద్దులంతా
సిగ్గు సింగారమంతా
పైలానాగ్ పరుచుకుంటా
వచ్చేస్తే ఇచ్చేస్తా సావాసమోలే సాగి

వీలునామా వేల జన్మలా
అందాలరేడ అందివస్త బుట్టబొమ్మలా

వీలునామా వేల జన్మలా
అందాలరేడ అందివస్త బుట్టబొమ్మలా

Mangli-Rani-Song-Lyrics-in-Telugu

Leave a Reply