Manidweepa Varnana Telugu Lyrics

Manidweepa  Varnana Lyrics in Telugu

Manidweepa  Varnana Lyrics :

మహశక్తీ మణిద్వీప  నివాసిని 
ముల్లొకాలకు మూల ప్రకాశిని
మణిద్వీపములో మంత్రరూపీణి
 మన మనస్సులలో కొలువైయుంది
 సుగంధ పుష్పాలెన్నోవెలు
అనంత సుందర సువర్ణపూలు
ఆచంచలoబగు మనోసుఖాలు 
మణిద్వీపానికి మహానిధులు
లక్షల లక్షల లావణ్యాలు
 అక్షర లక్షల వాక్ సంపదలు
 లక్షల లక్షల లక్ష్మీపతులు
 మణిద్వీపానికి మహానిధులు
పారిజాత వన సౌగంధాలు
 సూరాధినాధుల సత్సంగాలు
గంధర్వాదుల గానస్వరాలు
 మణిద్వీపానికి మహానిధులు
పద్మరాగములు సువర్ణమణులు
పది ఆమడల పొడువున గలవు
మధుర మధురమగు చందన సుధలు
మణిద్వీపానికి మహానిధులు
అరువది నాలుగు కళామతల్లులు
వరాల నొసగే పదారు శక్తులు
 పరివారముతో పంచబ్రహ్మలు
మణిద్వీపానికి మహానిధులు
అష్టసిద్ధులు నవ నవ నిధులు
 అష్టదిక్కులు దిక్పాలకులు
సృష్టి కర్తలు సురలోకాలు
మణిద్వీపానికి మహానిధులు
కోటి సూరులు ప్రచండకాంతులు
కోటి చంద్రులచల్లనివెలుగులు
కోటి తారకల వెలుగుజిలుగులు
మణిద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం
కంచుగోడల ప్రకారాలు
రాగి గోడలా చతురస్రాలు
ఎడామడల రత్నరాశులు
మణిద్వీపానికి మహానిధులు
పంచామృతమయ సరోవరాలు
పంచలోహామయ ప్రకారాలు
ప్రపంచమేలే ప్రజాధిపతులు
మణిద్వీపానికి మహానిధులు
ఇంద్ర నీలమణి ఆభరణాలు
వజ్రపుకోటలు వైడూర్యాలు
పుష్యరాగమణిప్రాకారాలు
మణిద్వీపానికి మహానిధులు
సప్త కోటి ఘన మంత్ర విద్యలు
సర్వ శుభప్రద ఇచ్చాశక్తులు
శ్రీ గాయత్రీ జ్ఞానశక్తులు
మణిద్వీపానికి మహానిధులు 
మిలమిలలాడే ముత్యపురాశులు
తళ తళ లాడే చంద్రకాంతములు
విద్యుల్లతలు మరకతమణులు
మణిద్వీపానికి మహానిధులు
కుభేర ఇంద్ర వరుణ దేవులు 
శుభాలనొసగే అగ్నివాయువులు
భూమిగణపతి పరివారములు
మణిద్వీపానికి మహానిధులు
భక్తిజ్ఞాన వైరాగ్యాసిద్దులు
పంచభూతములు పంచశక్తులు
సప్తఋషులు నవగ్రహాలు 
మణిద్వీపానికి మహానిధులు
కస్తూరి మల్లిక కుందవనాలు
సూర్యకాంతి శిలమహాగ్రహలు
ఆరు ఋతువులు చతుర్వేదాలు
మణిద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం
మంత్రిణీ దండిని శక్తిసేనలు
కాళి కారాళీ సేనాపతులు
ముప్పది రెండుమహశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
సువర్ణరజిత సుందరగిరులు
అనంతదేవి పరిచారికలు
గోమేధికమణి నిర్మిత గుహలు
మణిద్వీపానికి మహానిధులు
సప్త సముద్రములనంత నిధులు
యాక్షకిన్నెరా కింపురుషాదులు
నానాజగములు నదీనదములు
మణిద్వీపానికి మహానిధులు
మానవ మాధవ దేవగణములు
కామధేనువు కల్పతరువులు
సృష్టిస్తితిలయకారణ మూర్తులు
మణిద్వీపానికి మహానిధులు
కోటిప్రకృతుల సౌందర్యాలు
సకల వేదములు ఉపనిషత్తులు
పదారు రేకుల పద్మశక్తులు
మణిద్వీపానికి మహానిధులు
దివ్య ఫలములు దివ్యాస్త్రములు
దివ్య పురుషులు ధీరమాతలు
దివ్య జగములు దివ్య శక్తులు
మణిద్వీపానికి మహానిధులు
శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు
జ్ఞానముక్తి ఏకాంతభవనములు
మణినిర్మితమగు మండపాలు
మణిద్వీపానికి మహానిధులు
పంచ భూతములు యాజమాన్యాలు
ప్రవాళసాలం అనేక శక్తులు
సంతాన వృక్ష సముదాయాలు
మణిద్వీపానికి మహానిధులు
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం
చింతామణులు నవరాత్రులు 
నూరామడల వజ్రరాసులు
వసంత వనములు 
గరుడపచ్చలు మణిద్వీపానికి మహానిధులు
ధుఃఖము తెలియని  దేవీసేనలు
 నటనాట్యలు సంగీతాలు
ధనకనకాలు పురుషార్ధాలు 
మణిద్వీపానికి మహానిధులు
పదునాలుగు లోకా లన్నిటి పైన
సర్వలోకమను లోకము గలదు
సర్వలోకమే ఈ మణిద్వీపము
సర్వేశ్వరికది శాశ్వతస్టానం
చింతామణుల మందిరమందు
పంచబ్రహ్మల పంచముపైన
మహాదేవుడు భువనేశ్వరితో
నివసిస్తాడు మణిద్వీపములో
మణిగణ ఖచిత ఆభరణాలు
చింతామణి పరమేశ్వరి దాల్చి
సౌందర్యానికి సౌందర్యముగా
అగుపడుతుంది మణిద్వీపములో
పరదేవతను నిత్యముకొలచి
మనసర్పించి అర్చించినచో
అపారధనము సంపదలిచ్చి
మణిద్వీపేశ్వరి దీవిస్తుంది
నుతన గృహములు కట్టినవారు
మణిద్వీపవర్ణన తొమ్మిదిసార్లు 
చదివినచాలు అంతాశుభమే
అష్టసంపదల తులతూగేరు ||2||
శివకవితేశ్వరి  శ్రీచక్రేశ్వరి
మణిద్వీప వర్ణన చదివినచోట 
తిష్టవేసుకొని కూర్చొనునంటా 
కోటీశుభాలనుసమకూర్చుటకై
భువనేశ్వరీ సంకల్పమే జనియించే మణిద్వీపము
దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యం

Leave a Reply