Manninchava Amma Song Lyrics in telugu was written by koti mamidala composed by kalyan nayak sung by singer karthik and kalyan nayak a very special song from writer padmabhushan telugu movie
Song Details:
Movie- Writer: Padmabhushan (Telugu)
Song- Manninchava Amma
Music- Kalyan Nayak
Singers- Karthik and Kalyan nayak
Lyrics- koti mamidala
Label- Lahari Music
Manninchava Amma Song Lyrics in Telugu
ఆనందాల ఆకాశమే
అందిస్తావు నాకోసమే
అమ్మ నీకు ఏమివ్వనే
నువ్వే అడగవా
నను కాస్తావు కనుపాపలా
నను చూస్తావు నీ రేపులా
అయిపోతావు నా ఆటకి
నువ్వే బొమ్మలా
నా నిదుర కోసం జోలాలి జో జో
నను మరచి పోదే నిదురంటూ ఏ రోజు
కలలన్ని మోసి నువ్వు కన్న రాజు
అని మురిసిపోవా నను చూస్తూ ప్రతి రోజు
నీ ప్రాణం పంచావే ఒక నిండు జన్మలా
ఎవరైనా ఉంటారా భువిపైన అమ్మలా
ఓ పాదాలకే పది విధాలు నేర్పిన
వరం కదా మరి అమ్మ
తరతరాలుగా యుగయుగాలకి
వినిపించని కథ అమ్మ
నా పాదాలకే పది విధాలు నేర్పిన
వరం కదా మరి అమ్మ
తరతరాలుగా యుగయుగాలకి
వినిపించని కథ అమ్మ
నీ ఒడిని బడిగా
చేసి ఎన్నో కళలు నేర్పావు
నా కలలను ముందే
చదివి కథగా రాసావు
నీ కనులలో నను దాచి
లోకం నాకు చూపించి
నా ఊహల లోకంలో
నువ్ బ్రతికేస్తున్నావు
మన్నించవా నన్ను ఓసారి అమ్మ
నీకోసం నేను చేసిందేంలేదమ్మా
అడగాలనుంది అడిగేన అమ్మ
ఏ జన్మకైనా నన్నే కనవే అమ్మ
నీకేవో కావలి అని అడగలేదుగా
నీలోనే నేనున్నా గమనించలేదుగా
ఓ పాదాలకే పది విధాలు నేర్పిన
వరం కదా మరి అమ్మ
తరతరాలుగా యుగయుగాలకి
వినిపించని కథ అమ్మ
నా పాదాలకే పది విధాలు నేర్పిన
వరం కదా మరి అమ్మ
తరతరాలుగా యుగయుగాలకి
వినిపించని కథ అమ్మ