Muvvala Navvakala Song :
Muvvala Navvakala Song Lyrics in Telugu
Song Credits :
Movie : Pournami
Lyrics : Sirivennela
Music : Devisri prasad
Singers : SP.Balu,Chitra
మువ్వలా నవ్వకలా ముద్ద మందారమా
మువ్వలా నవ్వకలా ముద్ద మందారమా
ముగ్గులో దించకిలా ముగ్ద సింగారమా
నేలకే నాట్యం నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్లేశావే
నన్నిలా మార్చగల కళ నీ సొంతమా
ఇది నీ మాయ వల కాదని అనకుమా
ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమా
రేయికే రంగులు పూశావే
కలిసిన పరిచయం ఒకరోజే కదా
కలిగిన పరవశం యుగముల నాటిదా
కళ్ళతో చూసే నిజం కాదేమో
గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో
ఓ..ఓ..ఓ..ఓ
నన్నిలా మార్చగల కళ నీ సొంతమా
ఇది నీ మాయ వల కాదని అనకుమా
నేలకే నాట్యం నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్లేశావే
పగిలిన బొమ్మగా మిగిలిన నా కథ
మరియొక జన్మగా మొదలవుతున్నదా
పూటకో పుట్టుక ఇచ్చే వరం ప్రేమేగా
మనలో నిత్యం నిలిచే ప్రాణం తనేగా
ఓ..ఓ..ఓ..ఓ
మువ్వలా నవ్వకలా ముద్ద మందారమా
ముగ్గులో దించకిలా ముగ్ద సింగారమా
ఆశకే ఆయువు పోశావే మధుమంత్రమా
రేయికే రంగులు పూశావే