Na Brathuku Dinamulu Lyrics
Na Brathuku Dinamulu Lyrics :
నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము
దేవా ఈ భువిని వీడు గడియ నాకు చూపుము
ఇంకొంత కాలము ఆయుష్షు పెంచుము
నా బ్రతుకు మార్చుకొందును సమయమునిమ్ము
ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి
నా ఆశలు నా కలలనే వెంబడించుచుంటిని
ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని
ఏనాడు కూలిపోదునో ఎరుగకుంటిని
నా మరణ రోదన ఆలకించుమో ప్రభు
మరల నన్ను నూతనముగ చిగురు వేయని
నీ పిలుపు నేను మరచితి
నా పరుగులో నేనలసితి
నా స్వార్ధము నా పాపము
పతన స్థితికి చేర్చెను
నా అంతమెటుల నుండునో
భయము పుట్టుచున్నది
దేవా నన్ను మన్నించుము
నా బ్రతుకు మార్చుము
యేసూ నీ చేతికి ఇక లొంగిపోదును
విశేషముగా రూపించుము నా శేష జీవితం