Song Credits :
Lyrics : Music-Direction- Thirupathi Matla
Singer : Shirisha
Label : Sy Tv

నచ్చినావురో, పచ్చ బొట్టై… గుండె మీద గిచ్చినావురో…
అబ్బ..! నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా…

సురకత్తి సూపులోడా… సుక్కల్లో చందురూడ
మందిలో అందగాడ… మనసంత నిండినోడా…
నచ్చినావురో, పచ్చ బొట్టై… గుండె మీద గిచ్చినావురో…
అబ్బ..! నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా…
సిన్నసిన్నంగ జూసి… సిలిపి సైగలు జేసి
సిలకా గొట్టిన జామ కొరికి తినబెట్టిన్నాడే…
నచ్చినావురో, పచ్చ బొట్టై… గుండె మీద గిచ్చినావురో…
అబ్బ..! నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా…
తొవ్వల్ల కాపు గాసి… తీరొక్క పూలు గోసి
సన్నజాజులనేరి ఒళ్లే పోసిన్నాడే…
నచ్చినావురో, పచ్చ బొట్టై… గుండె మీద గిచ్చినావురో…
అబ్బ..! నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా…
ఊపిరి బిగబట్టి… మెల్లంగ సెయ్యి బట్టి
నా మట్టి కాళ్ళను ముట్టి ముద్దాడిన్నాడే…
నచ్చినావురో, పచ్చ బొట్టై… గుండె మీద గిచ్చినావురో…
అబ్బ..! నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా…
నువ్వంటే పాణమని… నీతోనే పయణమని
కొండంత ప్రేమతోటి ఒట్టేసి సెప్పిన్నాడే…
నచ్చినావురో, పచ్చ బొట్టై… గుండె మీద గిచ్చినావురో…
అబ్బ..! నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా…
వాగులమ్మా ఒడి… సేరి తానాలాడి…
అడివమ్మ సాక్షిగా అడుగులేసిన్నాడే…
నచ్చినావురో, పచ్చ బొట్టై… గుండె మీద గిచ్చినావురో…
అబ్బ..! నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా…
నువ్వు నేను గూడి… మోదుగు దుప్పలల్లి
మందల్ల ఆవు పాలు పిండి తాగిన్నాడే…
నచ్చినావురో, పచ్చ బొట్టై… గుండె మీద గిచ్చినావురో…
అబ్బ..! నచ్చినావురో పండుగోలే నాకు ఎదురొచ్చినావురా