Nelapai Song Lyrics in Telugu – Antheema Theerpu (2023)

Nelapai Song Lyrics in Telugu written by Vanamali sung by singer Sruthika, Sai Sri Charan music composed by koti latest telugu movie anthima theerpu

Song Credits:
Song: Nelapai
Movie: Antheema Theerpu
Singer: Sruthika,Sai Sri Charan
Music: Koti
Lyrics: Vanamali
Label: T-Series Telugu

Nelapai Song Lyrics in Telugu

నేలపై చినుకు పూలు
చీర నేసెలే

చేలపై చిలకపచ్చ
రంగులేసెలే

పిలిచింది నన్ను
చిటికేస్తు చిరుగాలే

పసిగువ్వ కన్ను
కలిపేస్తూ ఇటు వాలే

ఎటు అడుగేసినా వన్నెలే
ఇల హరివిల్లులే పల్లెలే

యేటిలో ఆటలాడే
చిలిపి చేపలే
తేటితో వరస కలిపే
తేనె పూ పొదలే

ప్రపంచమే సరితూగేనా
పల్లెసీమకే

ప్రతీ ఎద పరవశమవదా
వారి ప్రేమకే

మనసుల చెలిమే
తరగని కలిమే

ఒకమాట చాలు
పంచుతారుగా ప్రాణమే

సొగసుగ నేలపై
చినుకు పూలు

చీర నేసెలే
చేలపై చిలకపచ్చ
రంగులేసెలే

నిరంతరం తోడుగ
సాగే ఏరువాకలే

నిశీధినే దూరం
చేసె కాంతి రేఖలే

మమతలే మతము
మది అమృతము

ప్రతి గుండెలోన
దాగి ఉందిగా దైవము

కుదురుగ నేలపై
చినుకు పూలు

చీర నేసెలే
చేలపై చిలకపచ్చ
రంగులేసెలే

Faq – Nelapai Song

Nelapai Song Lyrics Writer?

Vanamali

Nelapai Song Music Composer?

Koti

Nelapai Song Movie Name?

Antheema Theerpu Telugu

Leave a Reply