O Sandamama bheemla nayak Song lyrics, ఓ సందమామ telugu lyrics penned by Kasarla Shyam sung by singer Mohana Bhogaraju composed by thaman s
Song Credits:
Song – O Sandamama
Singer – Mohana Bhogaraju
Lyrics – Kasarla Shyam
Music: Thaman S
Label Credits – Aditya Music
O Sandamama bheemla nayak lyrics – Pawan Kalyan (2022)
O Sandamama bheemla nayak Song lyrics Telugu
ఆ ఆఆ ఆ
ఆఆ ఆఆ
నువు జల్లే వెన్నెలంతా సల్లగుందని
మిడిసిపోకే, ఓ సందమామ
తన ఒళ్ళు కాల్చి ఎండ నీకు
ఎలిగిపోయే గుణమిచ్చిందే నా సందమామ
సందే ఏల కుంగుతుంటే
గెలిసినావని సంబరబడకే
ఓ సందమామ
కణకణ నిప్పుల కణిక వోలే
పొద్దుపొడిసే తెల్లవారి నా సందమామ
కీచురాళ్ళ చప్పుడు జేసి
గోసపెట్టినానుకోకే
ఓ సందమామ
మబ్బు జేసే ఘర్జనలింటే
దద్దరిల్లి బుగ్గలైతవ్ నా సందమామ
ఆకుపచ్చని అమ్మతోటి
ఆకతాయి ఆటలొద్దే
ఓ సందమామ
నిన్ను కూల్చగా జమ్మిచెట్టున
ఆయుధాలను దాచుకుందే నా సందమామ
సుట్టు సుక్కలు ఉన్నాయంటూ
సూసి నువ్వు మురిసిపోకే
ఓ సందమామ
నీ సిట్టసివరి దారిలోన నీడ కూడా
తోడు రాదే నా సందమామ
సీకటంతా తాగి నువ్వు
సిత్తరంగా సిందెయ్యకే
ఓ సందమామ
అమావాస్య ఘడియ నీకు
ముందరుందని మర్సిపోకే
నా సందమామ
నీను నేననే పట్టుతోటి
నీకు నువ్వే దూరంగాకే
ఓ సందమామ
నువ్వు పుట్టక ముందే పుట్టే
నువ్వు బోయినా ఉంటదే లోకం
నా సందమామ