Oddanna Gundello Seri Song Lyrics in Telugu written by Ajay Mengani music composd by madeen song sung by singers hanmanth yadam latest folk song from nivriti vibes
Song Credits:
Music- Madeen SK
Lyrics- Ajay Mengani
Singer- Hanmanth Yadav
Song- Oddanna Gundello Seri
Label- Nivriti Vibes
Oddanna Gundello Seri Song Lyrics in Telugu
ఒద్దన్న గుండెల్ల సేరి
ఒక్కసారన్నా రాయే సింగారి
ఊపిరాపేటి కత్తుల్ని నూరి
పట్టినావెట్ట నువ్వొంటి దారి
ఒద్దన్న గుండెల్ల సేరి
ఒక్కసారన్నా రాయే సింగారి
ఊపిరాపేటి కత్తుల్ని నూరి
పట్టినావెట్ట నువ్వొంటి దారి
ఊడల మర్రి ఉయ్యాల ఆట
ఇయ్యాల ఏమాయెనో
కాడుకు పంపే కయ్యాల బాటల
దయ్యాలు తోడాయనో
గడ్డి తిన్న నీ గుణము
గుడ్డిదాయె నా పాణము
మనసులున్న మనిషి
తోడు లేకపోతే
సచ్చిపోవుడే న్యాయము
గాయి గాయైతున్నదే
గంజాయి సెట్టు
గుండెల్లోన నాటినట్టు
జ్ఞాపకాలు గావు వట్టెనే
ఇడిసి ఉందామంటే నీ మీద ఒట్టు
వద్దన్న గుండెల్ల సేరి
ఒక్కసారన్నా రాయే సింగారి
ఊపిరాపేటి కత్తుల్ని నూరి
పట్టినావెట్ట నువ్వొంటి దారి
గా పొలముగట్ల పొంట
పావురాల జంటలెక్క
రెక్క కప్పుకుంటి గదే
గుండె గూటి గంట
గావురాల పంట అంటు
కళ్ళ దాసుకుంటి గదే
నీ మెత్తని పాదాలు
వత్తుక పోకుండా
ఎత్తుకొని నడిసినానులే
ఆ సిత్తురాల ప్రేమ
కత్తులే సెప్పులు లేకుండా
నిప్పుల్ల నడిపెనే
గాయి గాయైతున్నదే
గంజాయి సెట్టు
గుండెల్లోన నాటినట్టు
జ్ఞాపకాలు గావు వట్టెనే
ఇడిసి ఉందామంటే నీ మీద ఒట్టు
వద్దన్న గుండెల్ల సేరి
ఒక్కసారన్నా రాయే సింగారి
సిన్ననాటి నుండి పెంచుకున్న
దండి ప్రేమ నుండి దూరమైననే
గుండెలోన నిండి ఎండవోలె మండి
వళ్లనంటు వెళ్ళిపోయినవే
ఓ మనసు లేని మొండి
మోసే ప్రేమ బండి
గుండెకే గండి పెట్టేసినవే
నిన్ను పిలిసి గొంతు ఎండి
తలిసి మరిసే తిండి
అయినా తొండి చేసి గెలిసినవే
గాయి గాయైతున్నదే
గంజాయి సెట్టు
గుండెల్లోన నాటినట్టు
జ్ఞాపకాలు గావు వట్టెనే
ఇడిసి ఉందామంటే నీ మీద ఒట్టు
ఊపిరల్లే అల్లి ఉప్పెనల్లె మళ్ళీ
ముంచుతుంటే కళ్ళే సెమ్మగిల్లే
ఒళ్ళునంత గిల్లి యదల మీద దొర్లి
ఎళ్ళిపోతే యదల ఈగె ముళ్ళే
ఆ కాడు మందు జల్లి
అడుగులన్ని జల్లి
బోడగయ్యి గోడులయ్యే ఇల్లేనా
నా కన్న కలలు కుళ్ళి
గోడు వాసన జల్లి
ఏడ్సి బీడులయ్యే
నా ఈ కళ్ళే
గాయి గాయైతున్నదే
గంజాయి సెట్టు
గుండెల్లోన నాటినట్టు
జ్ఞాపకాలు గావు వట్టెనే
ఇడిసి ఉందామంటే నీ మీద ఒట్టు
ఊహల్ల విషమల్లే ఊరి
గుండె మీద గడ్డపార గీరి
చేసుకుంటాన నవ్వుల్ని చోరీ
కట్టమాకమ్మ నా గుండె ఘోరీ
ఒద్దన్న గుండెల్ల సేరి
ఒక్కసారన్నా రాయే సింగారి
ఊపిరాపేటి కత్తుల్ని నూరి
పట్టినావెట్ట నువ్వొంటి దారి