Oho Putthadi Bomma Song Lyrics – Thika Maka Thanda (2023)

Oho Putthadi Bomma Song Lyrics in telugu was written by Purna chary sung by singer sid sriram composed by suresh bobbili acted by rama krishna and hari krishna

Song Details:
Song Title : Ohho Puththadi Bommaa
Music : Suresh Bobbili
Lyrics : Purna chary
Singer : Sid Sriram
Label : Sony Music South

Oho Putthadi Bomma Song Lyrics

ఓహో పుత్తడీ బొమ్మ
నీ కళ్ళు చూసినంతనే
కళ్ళకద్దుకున్న

ఓహో పుత్తడీ బొమ్మ
నీకళ్ళ వాకిళ్ళలో ముగ్గులాగ ఉన్న

ఓహో

నీలాల నింగినే నే కళ్ళకద్దినా
నీ చూపు విరుపులే వేల మెరుపులా

మేఘాల తీరుగా కంటిపాప కదలగా
నీ కంటి చెమ్మనే తుడిచెదనా

ఓఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఊ

ఓ ఓ

బోనమెత్తిన బుట్టబొమ్మలా
రేగడిలో రేగుపండు నువ్వా

మట్టిలోపలా పుట్టగొడుగులా
ఉట్టిలో దాచుకున్న సద్దిబువ్వ

ఆ పాలపిట్ట పైట
దీపాల చిట్టి రైక
ఓ పట్టు దారమల్లుకుంటివా

ఆ పుట్టమట్టి తెచ్చి
నా చేత చుట్టి చుట్టి
ఓ బొమ్మలాగ చేసుకుందునా

ఓహో పుత్తడీ బొమ్మ
నీకన్న పెద్ద అందమే
నాకు ఎందుకమ్మ

ఓహో పుత్తడీ బొమ్మ
ఈ జన్మతోటి సాలునే
పంచుకుంటనమ్మా

పచ్చి పాలలో వెచ్చ నురగలా
అచ్చమైన ప్రేమలో న దించావే

లేగ దూడకే మెడలో గంటలా
గంటకొక్కసారి గుండె తట్టినావే

మాగాణిలోని గట్టు
నీ ఓని పూల జట్టు
వయ్యారమంత పోత పోస్తివే

నీ సోగకళ్ళ చాటు
తేనల్ని దాచినట్టు
నీ తీపి చూపునంత ఈయవే

ఓహో పుత్తడీ బొమ్మ
నీ అందమంత కళ్ళలో
నింపుకొంటినమ్మ

ఓహో పుత్తడీ బొమ్మ
నీ పేరు పక్క పేరునే
రాసుకొంటినమ్మా

Leave a Reply