Oorellipota Mama Song Lyrics – ChowRaasta

Oorellipota Mama Song Lyrics | ChowRaasta – Ram miriyala Lyrics

SingerRam miriyala
MusicChowRaasta
Song WriterAnand Gurram and Ram Miriyala

Label   ChowRaasta

ఊరేలిపోతా మామ…
ఊరేలిపోతా మామ..
ఎర్రబస్సు ఎక్కి మల్లి
తిరిగిల్లిపోతా మామ..

ఊరేలిపోతా మామ…
ఊరేలిపోతా మామ…
ఎర్రబస్సు ఎక్కి మల్లి
తిరిగిల్లిపోతా మామ..

ఏ ఊరువెళ్తావ్ రామ ఏముందాని ఎళ్తావ్ రామ
ఊరున్న పేరే తప్ప తీరంత మరే రామ

ఏ ఊరువెళ్తావ్ రామ ఏముందాని ఎళ్తావ్ రామ
ఊరున్న పేరే తప్ప తీరంత మరే రామ

నల్ల మల్ల అడవుల్లోనా పులి చింతచెట్ల కిందా
మల్లెలు పుసెటి సల్లని పల్లె ఒకటి ఉంది
మనసున్న పల్లె జనం మోసం తెలియని తనం
అడవి ఆ పల్లె అందం పువ్వుతేనెల చెందం

నల్ల మల్ల అడవుల్లోన పులి చింతచెట్ల కిందా
పుత్తడి గనులకోసం సీతాడి బావుల తవ్వె పుత్తడి మెరుపుల్లోన మల్లెలు మడిపోయే
మనసున్న పల్లె జనం వలసల్లో చెదిరిపోయే

ఏ ఊరువెళ్తావ్ రామ ఏముందాని ఎళ్తావ్ రామ
ఊరున్న పేరే తప్ప తీరంత మరే రామ…

ఏ ఊరువెళ్తావ్ రామ ఏముందాని ఎళ్తావ్ రామ
ఊరున్న పేరే తప్ప తీరంత మరే రామ…

గోదారి లంకల్లోన అరిటాకు నీడల్లోన
ఇసుక తేన్నేలుమిద వెండి వెన్నెళ్లూ కురువా…

గంగమ్మ గుండెల్లోన వెచ్ఛంగ దాచుకున్న
సిరులేన్నొ పొంగిపొరిలే పల్లెఒకటి ఉంది…

గోదారి గుండేల్లోన అరటాకు నీడల్లోన
ఇసుకంత తరలి పాయె ఎన్నేలు రాలిపోయే
ఎగువ గోదారి పైన ఆనకట్టలు వేలసే
ఆ పైన పల్లెలన్నీ నిలువునా మునిగి పోయే…

ఏ ఊరువెళ్తావ్ రామ ఏముందాని ఎళ్తావ్ రామ
ఊరున్న పేరే తప్ప తీరంత మరే రామ..

Leave a Reply