Sasivadane Title Song Lyrics in telugu written by Vissapragada sung by singers Haricharan, Chinmayi Sripada composed by saravana Vasudevan
Song Credits:
Song Name: Sasivadane
Music: Saravana Vasudevan
Singer: Haricharan, Chinmayi Sripada
Lyrics: Kittu Vissapragada
Label Credits: Tips Telugu
Sasivadane Title Song Lyrics
నాలో నేను ఏవేవో
కలలు కంటున్నానుగా
నీతో చేరి ఆ కలలు
అన్ని నిజమౌతాయిగా
మోమాటానికి చోటు లేదుగా
నిన్నా మొన్నా కాదుగా
ఆరాటానికి అంతులేదుగా
నువ్వే పక్కనే ఉండగా
నీ కొంటే చూపుల్లో ఏమి ఉందో
అర్థమవుతుంటే మాయగా
వాలు కన్నుల్లో బొమ్మలా
నే మారిపోతుంటే చాలుగా
శశివదనే శశివదనే
నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే
నీ సగమే నేనుగా
శశివదనే శశివదనే
నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే
నీ సగమే నేనుగా
ముసి ముసి నవ్వులు
మూగ సైగలు ముదిరిన వేళలో
పెదవుల అంచున
తీపి ముద్దులు అడిగిన హాయిలో
నలుగురు దారే ఉన్న
వేళ తీరు మారేనా
అటు ఇటు చూసి
దొంగ దారే వెతుకుతున్నానా
మనసులోన ఏవేవో
కథలు చేరగా
కుదురుగా ఓ చోటుండమంటే
సాధ్యమా ప్రియతమా
శశివదనే శశివదనే
నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే
నే సగమే నేనుగా
శశివదనే శశివదనే
నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే
నే సగమే నేనుగా
నీకు నాకు దూరాలు
అన్నమాటే రాదుగా
దారం కట్టి నీతోటి
మనసే పంపించానుగా
ఉలకదు పలకదు చిట్టి మనసే
నువు నను పిలవని రోజున
ఉరకలు పరుగులు కన్నె వయసుకి
నిను కలిసిన ప్రతి క్షణమున
ఏటిపై నావ సాగినట్టు
ఊహలో నువ్వే చేరగా
చేతిలో చెయ్యి వేసుకుంటే
గీతలే నేడు మారగా
ప్రియవదనా ప్రియవదనా
నువ్వుంటే చాలుగా
ఊపిరిలో ఊపిరిగా
నీ సగమే నేనుగా
శశివదనే శశివదనే
నువ్వుంటే చాలుగా
నీ వెనకే నా అడుగే
నీ సగమే నేనుగా