Seesa Mootha Ippu Song Lyrics in telugu written by chandrabose music composed by mm keeravaani from latest telugu movie naa saami ranga acted by nagarjuna and allari naresh, Raj tarun
Song Credits:
Song: Seesa Mootha Ippu
Music: M M Keeravaani
Lyrics: Chandrabose
Singers: Mallikarjun,Revanth,Saicharan, Lokesh,Hymath,Arun Koundiya
Label: Junglee Music Telugu
Seesa Mootha Ippu Song Lyrics in Telugu
పిల్ల సిగ్నల్ ఇచ్చిందంటే
ప్రేమ బండి చలో అంటే
రైస్ మిల్లు నెల జీతం
రై రైమని పెరిగిందంటే
ఫెవరేట్ హీరో బొమ్మ
హౌస్ ఫుల్లు పడిందంటే
ఇండియా కప్పు కొట్టుకొస్తే
ఇల్లాలే రాజీకొస్తే
పక్కింటోడికి లాసొస్తే
హ హ ఆడ్ని ఓదార్చే
ఛాన్సే వస్తే
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు
బోరు కొడితే బీరు కొట్టు
బాధ పడితే బ్రాందీ కొట్టు
ఇసుకు పుడితే ఇస్కీ కొట్టు
మూడంతా పాడైపోతే
పై మూడు కలిపి కొట్టు
కట్టుకుందాన్తో కల్లే కొట్టు
అన్నదమ్ముల్తో జిన్నే కొట్టు
సోదర సోదర అన్నోల్తో
సోడా కలిపి కొట్టు
రా రా పోరా అన్నోల్తో
రా గానే కొట్టు
మనకన్నా పెద్దోల్లొస్తే
మస్కా కొట్టు
సాటుగ మందే కొట్టు
మొదటి పెగ్గు ఎయ్యగానే
మత్తు కమ్ముకొస్తాది
రెండో పెగ్గు పడగానే
ఒళ్ళు తేలిపోతాది
మూడు నాలుగైదు పెగ్గులు
గొంతులోకి దిగగానే
నా సామిరంగ
సిత్రాలే సిత్రాలు
నా సామిరంగ
పెరటిలోని పిల్లి కూన
బౌ బౌ అంటాది
నూతిలోని సేపపిల్ల
సుట్ట కాల్చుతాది
సేతిలోని ఇసనకర్ర
సికెను ముక్కై పోతాది
మూలకున్న ఇసుర్రాయి
ఎండి కంచమే అది
తొంబై రూపాయల నోటు
జేబులోంచి జారుతాది
తొడుక్కున్న గల్ల లుంగీ
సొక్కా అయిపోతది
ఆ ముంగటేడు పోయిన
మా ముసలి తాత ఎదరకొచ్చి
ఏరా అబ్బీ తినలేదా ఏమి తాగట్లేదా
బక్క సిక్కి పోయావు ఏందిరా ఇదీ
అని పలకరిస్తాడు
ప్రేమగ హెచ్చరిస్తాడు
ఈ మందుని కని
పెట్టినోడు యాడున్నాడో
అరెరెరె మందుని
కనిపెట్టినోడు యాడున్నాడో
ఆడి కంటికి ముక్కుకి సెవులకి
కాళ్ళకి మూతికి సేతులకి
దండాలెట్టి అరెరెరె దండాలెట్టి
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏం సెయ్యాలి సెప్పు
సీసా మూత ఇప్పు
ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు
ఏసెయ్యాలి సిప్పు
సిప్పు మీద సిప్పు