Somma Silli Pothunnava Part 2 Song Lyrics Telugu – Ramu Rathod (2022)

Somma Silli Pothunnava Part 2 Song Lyrics Telugu here is the latest folk song sommasilli pothunnave music composed by kalyan keys

Song Credits:
MUSIC- KALYAN KEYS
LYRICS- RAMU RATHOD
SINGERS- DIVYA MALIKA – RAMU RATHOD
Song- Somma Silli Pothunnava Part 2
Label Credits- Rathod Tunes

Somma Silli Pothunnava Part 2 Song Lyrics Telugu

ఎన్నాళ్లదో ఈ బంధము
ఏకమవ్వాలి ఈ నిమిషము

ఆగనాంటోంది నా ప్రాణము
ఇక పై నీతోనే నా పయనము

నిన్ను సూడక ఇన్నాళ్లు
సూసాక నా కళ్ళు
సంద్రాన్ని తలపించేరా

రేపు ఉండేటి నా ఇల్లు
అవ్వాలి హరివిల్లు
నీ నీడలో హాయిరా

నాలోని ఈ బాధను
నీకు పంచాలి నా ప్రేమను

నాతో ఉండేటి ప్రతి జన్మను
నీకు రాసిస్తే నే ధన్యము

నీలోని ప్రేమంతా
నాలోనే దాచుంచ
నా మనసు గెలిచినోడా

నీతో నా గుర్తులు
పదిలాంగానే ఉంచా
నా ఏలు వట్టేటోడా

నిదురలోన కూడ
నీ పేరే నే తలిచా
నా కంటి రేప్పైనోడా

నీతోనే దూరంగా
నేనుండ లేనంటూ
నీ సేంత సేరానురా

నన్నెలుకో నా దొర
ఊపిరావుతాను నీకురా

నువ్వే లేక నేనురా
నాలోని ప్రాణమే నీవురా

ఆ ఆ ఆ

ఏరోజైనా గాని ఇంత ఆనందాన్ని
నే చూడలేకున్నారా

కానీ నీ కళ్ళలో కళ్ళు చూస్తుంటే
నా ఒళ్ళు పులకరించే చూడరా

ఏనాటికీ నేను
నీ ఎదురు సూపును
మరువనే మరువనురా

ఎల్లా వేళల నువ్వు
నా కోసం తపియించినావు గనకే మురిసారా

కలలోనైనా కనలేదురా
కానుకల్లే కలిసావురా

కడదాకా నీతో నేనురా
కలిసుంటా నీ కౌగిట్లో వాలిరా

సిననాడు నీఎంట
తిరిగెటి ఆ వింత
సిత్రమై గురుతున్నాదే

సూడసక్కనిదంట
మన ఇద్దరి ఈ జంట
పండెనే మన పంటనే

ఇంకా సాధించిన మన ప్రేమ
సిక్కులు రాకుండా
సల్లంగా వర్ధిల్లనే

ఇకపైన సచ్చేదాకా
నీతో తోడుగుండి
మన ప్రేమను బ్రతికిద్దామె

అమ్మోలే లాలించవే
నాన్నోలే తోడుంటానే

కంటి పాపోలే కాపుండవే
చంటిపాపోలే నిను జూత్తనే

Faq – Somma Silli Pothunnava Part 2 Song

who is the singer of Somma Silli Pothunnava Part 2 Song?

DIVYA MALIKA – RAMU RATHOD

Who wrote telugu lyrics somma silli pothunnave part 2 song?

RAMU RATHOD

Somma Silli Pothunnava Part 2 Song Cast?

RAMU,DIVYA MALIKA

Leave a Reply