Swagathaanjali Song Lyrics – Chandramukhi 2 Telugu (2023)

Swagathaanjali Song Lyrics in telugu written by Chaitanya Prasad music composed by mm keeravaani sung by singer sreenidhi tirumala acted by kangana ranaut and raghava lawrence latest telugu movie

Song Credits:
Song Title: Swagathaanjali
Album / Movie: Chandramukhi 2
Music: M.M. Keeravaani
Singers: Sreenidhi Tirumala
Lyrics: Chaitanya Prasad
Label: Sony Music South

Swagathaanjali Song Lyrics in Telugu

లాస్య విలసిత
నవ నాట్య దేవత
నటనాంకిత అభినయవ్రత
చారు ధీర చరితా

స్వాగతాంజలి స్వాగతాంజలి
జనన జనననూపురారి స్వాగతాంజలి

ఓ చంద్రముఖి
నీకిదే స్వాగతాంజలి

ఆ ఆఆ ఆ ఆ
ఆ ఆ ఆఆ
ఆ ఆ ఆ ఆ

పదము పదముగా
హృదయలయలుగా
ప్రకృతి పురుషులే పరవశించగా

ప్రణవము వినుతించిన నాట్యం
తరికిట తరికిట తా

నయన మధురమై
నటన సధనమై
నరనరాలలో నాద భరితమై

నవజీవన రసమయ లాస్యం
తోం త ధీం త తోం

సఖుడా సఖుడా ఆ ఆ ఆ
నీపై ధ్యాస నా ఎద గోష
తక తక తరికిట తకిట తకిట
తాళము సాగిన ఊసుల గుస గుస

పదము పదముగా
హృదయలయలుగా
ప్రకృతి పురుషులే పరవశించగా
ప్రణవము వినుతించిన నాట్యం

ఎన్ని కళలు ఎన్ని అలలు
కన్నె మనసు పొరలలో
వలపులెగసి
తలపులెగసి నాలో

సాంద్ర కలల ఇంద్రధనుసు
వెల్లివిరిసె వయసులో

మరుల విరుల
సరులు మెరిసే లోలో

సాంబశివుని దివ్య చరణ
చరిత లలిత గతులలో

ఆత్మ విభుని
మదిని తలచి ఆడి పాడనా

ప్రణయిని పద
చలనమే నాట్యం
తోం త ధీం త తోం

పదము పదముగా
హృదయలయలుగా

ప్రకృతి పురుషులే పరవశించగా
నవ జీవన రసమయ లాస్యం

Leave a Reply