Kalyanam Song Lyrics, Pushpaka Vimanam Kalyanam Kamaneeyam Lyrics telugu by Kasarla Shyam kalyanam song sung by singers Sid Sriram,Mangli, Mohana Bhogaraju, Divya Malik, Hari Priya music ram miriyala
Song Credits:
Song – Kalyanam
Singer- Sid Sriram
Chorus- Mangli, Mohana Bhogaraju, Divya Malik, Hari Priya
Lyrics – Kasarla Shyam
Music – Ram Miriyala
Album – Pushpaka Vimanam
Label Credit – Aditya Music
Kalyanam Song Lyrics – Pushpaka Vimanam (2021)
Kalyanam Kamaneeyam Song Lyrics –

అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో
మోగేటి సన్నాయి మోతలలో
సాగేటి సంబరాలో
కొయిలాలో రామ సిలకలాలో
పలకండి మంతరాలో
కళ్యాణం కమనీయం
ఒకటయ్యే వేళనా వైభోగం
కళ్యాణం కమనీయం
ఈ రెండు మనసులే రమణీయం
మూడే ముళ్ళట
ముడి పడుతుంటే ముచ్చట
నాలుగు దిక్కులకంట
చూడ ముచ్చటైన వేడుకంట
ఆ పంచ భూతాల తోడుగా
ప్రేమ పంచుకునే పండగంట
ఆరారు కాలాల నిండుగా
ఇది నూరేళ్ళ పచ్చని పంట
అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
ఇంటిపేరు మారే ఈ తంతులో
చుక్కలే అక్షింతలో
మోగేటి సన్నాయి మోతలలో
సాగేటి సంబరాలో
పలకరించే తడి ఓ లీలలో
పుట్టినింటి కళ్ళలో
ఏడడుగులేయగ ఈ అగ్ని మీకు సాక్షిగా
ఏడూ జన్మలా బంధంగా
ఎనిమిది గడప దాటి ఆనందాలు చూడగా
మీ అనుబంధమే బలపడగా
ఇక తొమ్మిది నిండితే నెలా
నెమ్మ నెమ్మదిగా తీరే కల
పది అంకెల్లో సంసారమిలా
పదిలంగా సాగేటి అల
ఒక్కటయ్యేనంటా ప్రాణం
ఒకరంటే ఇంకొకరి లోకం
ఇద్హరు చెరో సగం
ఇక ఇద్దరిదంటా కష్టం సుఖం
అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో
మోగేటి సన్నాయి మోతలలో
సాగేటి సంబరాలో
కొయిలాలో రామ సిలకలాలో
పలకండి మంతరాలో
అమ్మలాలో పైడి కొమ్మలాలో
ముద్దుల గుమ్మలాలో
సందళ్ళు నింపారే పందిళ్ళలో
బంగారు బొమ్మలాలో
మోగేటి సన్నాయి మోతలలో
సాగేటి సంబరాలో
కొయిలాలో రామ సిలకలాలో
పలకండి మంతరాలో