Nuvvila Okkasarila Song Lyrics – Manasara (2010)

Nuvvila Okkasarila Song Lyrics,chudali chudali చూడాలి చూడాలి అంటు నీ తోడే కావాలి అంటు నా ప్రాణం అల్లాడుతోంది లోలోపల lyrics given by Bhaskara Bhatla music by sekhar chandra song sun by krishna chaitanya

Song Credits:
Movie : Manasara
Lyrics : Bhaskara Bhatla
Music : Sekhar Chandra
Singer : Krishna Chaitanya

Nuvvila Okkasarila Song Lyrics – Manasara

నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా

గుండె లోపల ఉండుండి ఏంటిలా
ఒక్కసారిగ ఇన్నిన్ని కవ్వింతలా

నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా

చూడాలి చూడాలి అంటు నీ తోడే కావాలి అంటు
నా ప్రాణం అల్లాడుతోంది లోలోపల

ఇంతందం ఇన్నాళ్ళనుండి దాక్కుంటు ఏ మూల ఉంది
గుండెల్లోన గుచ్చేస్తుంది సూటిగా

పేరే అడగాలనుంది మాటే కలపాలనుంది
ఎంతో పొగడాలనుంది నిన్నే నిన్నే

కొంచెం గమ్మత్తుగుంది కొంచెం కంగారుగుంది
అంతా చిత్రంగా ఉందె ఈ రోజు ఎమైందిలా

నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా

చంద్రున్నె మింగేసిందేమొ వెన్నెల్ని తాగేసిందేమొ
ఎంతెంతో ముద్దొస్తున్నాది బొమ్మలా

తారల్ని ఒళ్ళంత పూసి మబ్బుల్తొ స్నానాలు చేసి
ముస్తాబై వచ్చేసిందేమొ దేవతా

మొత్తం భూగోళమంతా పూలే చల్లేసినట్టు
మేఘాలందేసినట్టు ఉందే ఉందే

నన్నే లాగేస్తునట్టు నీపై తోసేస్తునట్టు
ఎంటో దొర్లేస్తునట్టు ఎదేదో అవుతోందిలా

నువ్విలా నువ్విలా ఒకసారిలా అరె ఏం చేసావే నన్నిలా
కోయిలా ఎందుకోయిలా నిను చూస్తూ చూస్తూ చాలిలా

Leave a Reply